top of page

ఉజ్వలమైన బాల్యం కోసం ‘వారధి’స్థాయి-- సబ్జెక్టు-- ఆశించిన అభ్యసన ఫలితాలు

ఉజ్వలమైన బాల్యం కోసం ‘వారధి’ స్థాయి-- సబ్జెక్టు-- ఆశించిన అభ్యసన ఫలితాలు

1 st LEVEL

తెలుగు: వర్ణమాలలో అక్షరాలను గుర్తించడం, మూడక్షరాల పదాలను గుర్తించడం. తప్పులు లేకుండా చదవడం, రాయడం, సరళమైన వాక్యాల లేఖనం.

గణితం: 1 నుంచి 100 సంఖ్యలు, 1 నుంచి 10 అంకెలను పదాలగా రాయడం.

ఆంగ్లం: ఆంగ్ల వర్ణమాల, రెండు నుంచి నాలుగు అక్షరాల పదాలను గుర్తించడం, తప్పులు లేకుండా చదవడం, రాయడం.

2 nd LEVEL

తెలుగు: సరళమైన వాక్యాలు చదవడం, రాయడం, అర్థవంతంగా చదవడం, సాధారణ వాక్యాలను మాట్లాడటం.

గణితం:1 నుంచి 100 సంఖ్యలను పదాలుగా రాయడం, రెండంకెలతో సంకలనం, గుణకారం భాగహారం గణిత పదజాలంపై అవగహన.

ఆంగ్లం: సరళమైన వాక్యాలు చదవడం, రాయడం, అర్థవంతంగా చదవడం, సాధారణ వాక్యాల్లో మాట్లాడటం.

బోధన ప్రక్రియ ఇలా...

➧1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని గేయాలను నేర్పించాలి. ➧పెద్ద అక్షరాల్లో రాసిన అభినయ గీతాల చార్టులను ప్రదర్శించడం. ➧అభినయ గేయం గురించి విద్యార్థులతో సంభాషించడం. ➧ఉపాధ్యాయుడు మూడు సార్లు పాడి వినిపించడం ➧ఒక్కో వాక్యం పాడుతూ బాలలతో పాడించడం. ➧విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాడటం ➧విద్యార్థులు సొంతంగా పాడటం. ➧అభినయిస్తూ ఉపాధ్యాయుడు ఒక్కో వాక్యం పాడటం. ➧గేయాల్లోని కీలక పదాలను గుర్తించడం ➧అభినయ గేయంలోని ప్రాధాన్య విషయాన్ని విద్యార్థులతో చర్చిండం ద్వారా భావాలు, అందులోని పాత్రలు, వాటి స్వభావంపై అవగహన కల్పించడం. ➧విద్యార్థులు అభినయిస్తూ గేయం మొత్తాన్ని పాడటం

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page