top of page

ఉద్యోగుల సేవా నిబంధనలు  (Employee Service Rules)

ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules)


‌విద్యా శాఖలో సెలవు మంజూరు అధికారం, సంబంధిత ఉత్తర్వులు:


👉విద్యాశాఖలో వివిధ రకాల సెలవుల మంజూరు,రిపోర్టింగ్,రిపోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే అధికారుల కాలపరిమితిని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇవ్వబడినవి.(G .O. Ms. No.58,Edn తేది:22-04-2008)(G.O. Ms .No.70,Edn తేది:07-07-2009)


PS & UPS ప్రధానోపాధ్యాయులు:


👉పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL, Spl CL మంజూరు.


 ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు :


👉పాఠశాలల్లోని సహోపాధ్యాయులకు CL, Spl Cl, CCL లతో పాటు 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరు చేయవచ్చు.


మండల విద్యాధికారి(MEO):


👉మండల పరిధిలోని PS, UPS ప్రధానోపాధ్యాయులకు CL, Spl CL, CCL మరియు ఉపాధ్యాయులందరికీ 4 నెలల పరిమితితో ఇతర ఏ సెలవునైనా మంజూరుచేస్తారు.


జిల్లా ఉపవిద్యాధికారి(Dy.EO):


👉హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు CL, Spl CL, CCL లతో పాటు తన పరిధిలోని PS, UPS & HS ఉపాధ్యాయులందరికీ 6 నెలల వరకు ఇతర సెలవును మంజూరుచేస్తారు.


జిల్లా విద్యాశాఖాధికారి (DEO):


👉Dy.Eo, MEO లకు CL, Spl CL, CCL మంజూరు చేస్తారు. Dy.Eo, MEO,హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులందరికీ 6 నెలలకు పైబడి 1 సం॥ లోపు ఏ రకమైన సెలవునైనా మంజూరుచేస్తారు.


పాఠశాల విద్యాశాఖ సంచాలకులు(DSE):


👉మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు 1 సం॥ పైబడి 4సం॥ వరకు ఏ రకపు సెలవునైనా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మంజూరు చేస్తారు. అంతకుమించిన కాలానికి సెలవు మంజూరు అధికారం ప్రభుత్వానికే ఉంటుంది.


ప్రసూతి సెలవు (Maternity Leave) సందర్భంలో     


👉మహిళా ఉపాధ్యాయులకు 6 నెలల వరకు సెలవు మంజూరుచేయు అధికారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, మండలంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు సెలవు మంజూరు అధికారం మండల విద్యాధికారులకు (MEO) లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.(G.O. Ms. No.84 తేది:17-09-2012)


విదేశాలకు వెళ్ళేందుకు సెలవు మంజూరు:   


👉విదేశాలకు వెళ్ళే ఉపాధ్యాయులు ఏ రకమైన సెలవుపై ఎంతకాలం వెళ్ళదలచుకున్నా (5సం॥ లోపు) ప్రభుత్వం నుండి ముందుగా అనుమతి తీసుకోవాలి.విదేశాలలో ఉద్యోగం కొరకు వెళ్ళే ఉద్యోగులకు కొన్ని షరతులతో 5సం॥ వరకు EOL మంజూరుకు అనుమతిస్తారు.(G.O.M s. No.214 F&P తేది:03-09-1996)

6 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page