ఉపాధ్యాయ బదిలీలు--చిగురిస్తున్న ఆశలు
సంక్రాంతి సెలవుల్లో బదిలీలు అని మంత్రిగారు హామీ ఇచ్చారని వింటున్నాం.దీనిలో నిజం ఎంత ?
సుమారు10 సంవత్సరములుగా సుదూర ప్రాంతాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సంక్రాంతికి బదిలీలు జరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.దీని పై అన్ని సంఘాలు సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉన్నది.
సంక్రాంతికి బదిలీలు జరగాలి.లేకపోతే 2021 వరకు వేచివుండాలి. ఎందుకంటే......
ఒక రిటైర్డ్ స్టాటికల్ ఆఫీసర్ వివరణ :: ఒకసారి కేంద్ర విధులకు(జనాభా లెక్కల డ్యూటీ) వెళితే సంపూర్ణం గా పూర్తి అయ్యేవరకు అనగా 2020 డిసెంబర్ వరకు బదిలీ లు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కు ఉండదు.కావున 2021 వరకు వేచివుండక తప్పదు.
"అమ్మ ఒడి"అమలు తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగవచ్చు. ఎన్నికల కోడ్ వచ్చినా బదిలీలు సాధ్యంకాదు.
వచ్చే సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఉపాద్యాయులకు శిక్షణా తరగతులు ఉంటవని మంత్రిగారు తెలియచేసారు. శిక్షణా తరగతుల మధ్యలో బదిలీలు సాధ్యం కాదు.
ఉపాధ్యాయబదిలీలుఇన్నిఅంశాలతోముడిపడివున్నాయి కావున బదిలీలు సంక్రాంతి సెలవుల్లో జరగడమే మేలు.
బదిలీలు ఆర్థిక సంబంధమైనవి కావు కనుక అందరం కోరితే జరిగే అవకాశం ఉంటుంది.
మనందరం ఏ సంఘం అయినప్పటికి బదిలీల ఆవశ్యకతను ఆయా జిల్లా మరియు రాష్ట్ర సంఘాలకు తెలిసేలా చేద్దాం.సంఘ నాయకులను అభ్యర్దిద్దాం!
బదిలీలు షెడ్యూలు డిసెంబర్ నెలలో విడుదల అయితే మంచిది.
బదిలీలు కోరుకునేవారు అందరికీ షేర్ చేయండి.
ఇట్లు
సత్వరమే బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు.