top of page
Writer's pictureAPTEACHERS

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లో మొత్తం 2723 పోస్టులకు గాను 2623 పోస్టులను పోలీసు శాఖ భర్తీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 👉 slprb.ap.gov.in వెబ్‌సైట్లో పోలీస్ శాఖ అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు శాఖ వెల్లడి. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 👉 apslprb.pcsobj@gmail.comకు ఈ నెల 16వ తేదీలోపు పంపవచ్చని పోలీసుశాఖ పేర్కొంది. 👉🏻 ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ కుమార్ విశ్వజీత్ హాజరయ్యారు.

3 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page