top of page
Writer's pictureAPTEACHERS

ఏపీలో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియవాయిదా  నోటిఫికేషన్No. 68/SEC-BI/2020,Dt:15/3/20

ఏపీలో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియవాయిదా నోటిఫికేషన్No. 68/SEC-BI/2020,Dt:15/3/20


ఏపీలో అరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా. ఎపి ఎలక్షన్ కమీషనర్ రమేష్ కుమార్ కామెంట్స్ అత్యవసర పరిస్దితుల్లో కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఉంటాయి పంచాయితీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సింది.. ఎన్నికలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని పలు పార్టీలు, సామాజిక సంఘాలు చెప్పాయి. కరోనా ఎఫెక్ట్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేసాం. నోటిఫై డిజాస్టర్ గా కరోనాని ప్రధాని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఓటుకి ఎక్కువ సమయం పడుతుంది..చాలా సేపు క్యూలో నిలబడాలి విధిలేని పరిస్దితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్నాం నిలిపివేత మాత్రమే రద్దు కాదు. ఆరువారాల తరువాత సమీక్ష అనంతరం ఎన్నికలు జరుగుతాయి. ఆరువారాల తరువాత పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తాం.. ఇప్పటికే ఏకగ్రీవం అయిన వారికి ఎన్నికలు ఉండవు... నామినేషన్ వేసిన వారిని భయబ్రాంతులకి గురిచేయకూడదు.. ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలి.. గ్రామవాలంటీర్ పై అనేక ఫిర్యాదు వస్తున్నాయి.. ఉద్యోగుల వ్యక్తిగత, ఆరోగ్య భద్రత కూడా ముఖ్యం .. కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేసింది.. శ్రీకాళహస్తి ,పలమనేరు డీఎస్పిలను ట్రాన్స్ ఫర్ చేయాలి.. శ్రీకాళహస్తి ,పలమనేరు, రాయదుర్గం, పుంగనురు ఇన్సిపెక్టర్లను సస్పెండ్ చేయాలి.. ఎంపీపీ, జడ్పీ నామినేషన్స్ లో జరిగిన హింసాత్మక ఘటనలను ఈసీ తీవ్రంగా పరిగణిస్తుంది.. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్టు భావిస్తున్నాం అధికారులు ప్రేక్షక పాత్రను పోషిచడం దారుణం.. కొందరి అధికారులపై చర్యలు తీసుకోవాలి.. హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుడదని ఆశిస్తున్నాం.. అత్యంత హింసాత్మక ఘటనలు జరిగిన గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను విధుల నుండి తప్పించాలి. మాచర్ల ఘటనలో నిందితులకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం హేయమైన చర్య.. సీఐని సస్పెండ్ చేయాలి. శ్రీకాళహస్తి, పలమనేరు రాయదుర్గం తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఎన్నికలు నిశితంగా గమనిస్తుంది.. అవసరమైతే వాటి వరుకు ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహిస్తాం.


Click here to download election stoppage copy 👇


https://drive.google.com/file/d/14KQLdbcxgNpAoTvZ6ic4wJePtPvlA5-H/view?usp=drivesdk

12 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page