కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
సెప్టెంబర్ 15 నుంచి తరగతులు
రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నోటిఫికేషన్ ఏప్రిల్-మేనెలల్లోనే రావాల్సి ఉండగా.. కరోనా విస్తృతి నేపథ్యంలో విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడితే సెప్టెంబర్ 15 నుంచి తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
ఈ మేరకు సోమవారం విడుదలైన ఒక ప్రకటనలో ఆన్లైన్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ప్రతి కేంద్రీయ విద్యాలయలో ఒకటో తరగతిలో 40 మంది విద్యార్థుల ప్రవేశాలకు అవకాశం ఉంది.*
ఈ ఏడాది మార్చి 31 నాటికి ఐదేళ్లు పూర్తయి, ఏడేళ్లు నిండని చిన్నారులు ఒకటో తరగతి ప్రవేశానికి అర్హులవుతారు.
ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి ఆగస్టు ఏడో తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తుకు అవకాశం ఉంది.
రెండో తరగతి, ఇతర తరగతుల్లో ఖాళీలను 25వ తేదీలోపు గుర్తించి, ఆ మేరకు విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించనున్నారు.
పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాలు విద్యార్థులకు అందిన వారం రోజుల్లోపే ఇంటర్ లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఇందుకోసం ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ఈ ఏడాది నుంచి కల్పించారు.
వెబ్ సైట్ తోపాటు కేవీఎస్ రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Website
👇
Mobile App
👇