top of page
Writer's pictureAPTEACHERS

కౌశల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభా అన్వేషణ పోటీ-2019

💥కౌశల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభా అన్వేషణ పోటీ-2019💥 ⚡ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించుటకు భారతీయ విజ్ఞాన మండలి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా నిర్వహించే ప్రతిభాన్వేషణ పోటీ కౌశల్. 👉 కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ : * అర్హులు; 8,9,10 తరగతుల విద్యార్థులు * క్విజ్ టీం సంఖ్య: 3 * ఒక పాఠశాల నుండి ఒక టీం మాత్రమే అనుమతించబడును. * కేవలం ప్రభుత్వరంగ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే * బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు. జిల్లాస్థాయి నగదు బహుమతులు: ప్రథమ బహుమతి: 5000 ద్వితీయ బహుమతి: 3000 తృతీయ బహుమతి: 2000 రాష్ట్రస్థాయి నగదు బహుమతులు; ప్రథమ బహుమతి: 10000 ద్వితీయ బహుమతి: 7500 తృతీయ బహుమతి: 5000 4,5,6 స్థానాల విజేతలకు 2000 చొప్పున పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ; 8,9 తరగతుల నుండి ఇద్దరు విద్యార్థులు ఒక పాఠశాల నుండి అనుమతించబడును ( రెండు ప్రజెంటేషన్లు) థీమ్స్: 👉 స్వచ్ఛభారత్ 👉 జల సంరక్షణ 👉 జీవ వైవిద్య పరిరక్షణ 👉 వాతావరణ మార్పులు 👉 ప్రకృతి వ్యవసాయం 👉 ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం బహుమతులు: సర్టిఫికేట్, జ్ఞాపిక మరియు నగదు. జిల్లాస్థాయి నగదు బహుమతులు: ప్రథమ బహుమతి: 3000 ద్వితీయ బహుమతి: 2000 తృతీయ బహుమతి: 1000 రాష్ట్రస్థాయి నగదు బహుమతులు; ప్రథమ బహుమతి: 5000 ద్వితీయ బహుమతి: 3000 తృతీయ బహుమతి: 2000 4,5,6 స్థానాల విజేతలకు 1000 చొప్పున 👉 ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతిభగల విద్యార్థులను గుర్తించి సైన్స్/ గణిత ఉపాధ్యాయులు పాఠశాల కోఆర్డినేటర్లు గా వ్యవహరించి విద్యార్థులను ప్రోత్సహించవలెను పాఠశాల కోఆర్డినేటర్లు 31.10.2019 లోపు విద్యార్థుల పేర్లను www.bvmap.org ద్వారా ఆన్లైన్లో నమోదు చేయవలెను రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ: 31.10.2019 జిల్లాస్థాయి పోటీలు: 30.11.2019 రాష్ట్రస్థాయి పోటీలు: 14.12.2019 రాష్ట్రస్థాయి విజేతలకు బహుమతులు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదగా అందజేయబడును ప్రతి పాఠశాల నుండి పై పోటీలకు విద్యార్థులను తప్పనిసరిగా నమోదు చేయించవలెను

15 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page