top of page
Writer's pictureAPTEACHERS

    గ్రామ సచివాలయం హాల్ టికెట్లు 

గ్రామ సచివాలయాలు


★ గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షలు సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహణ.


★ సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పరీక్ష నిర్వహించడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.


★ అభ్యర్థుల తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


★ సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహణ.


★ ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్క్‌లు ఉంటాయి. అన్ని పోస్టులకు 150 మార్కులకే పరీక్షలు నిర్వహణ.


★ కేటగిరీ 1లో ఉన్న పోస్టులకు పార్టు(ఏ) 75 మార్కులు, పార్టు(బీ) 75 మార్కులకు ఉంటాయి.


★ మిగతా అన్ని పోస్టులకు పార్టు(ఏ) 50, పార్టు(బీ) 100 మార్కులకు జరుగుతుంది.


★ ప్రతీ నాలుగు తప్పు సమాధానాలకు ఒక నెగిటివ్ మార్క్‌ వేస్తారు.


★ గ్రామ/వార్డ్ సచివాలయం హాల్ టిక్కెట్లను ఈక్రింది వెబ్ సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు... 👇🏻 http://vswsht19241112.apcfss.in/SearchVsws2019785639.htm


http://gramasachivalayam.ap.gov.in


http://wardsachivalayam.ap.gov.in/


★ OTPR మర్చిపోయారా?.. ఈక్రింది లింక్ ద్వారా క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 👇🏻


https://bit.ly/2zgQUa3


స‌చివాల‌య రాత పరీక్షలు - అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


★ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.


★ పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.


★ మహిళలు, దివ్యాంగులకు వారి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.


★ అభ్యర్థులు హాల్‌టికెట్‌‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి.


★ ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.


★ ప్రతి ప్రశ్నపత్రాన్ని A, B, C, D సిరీస్‌లో జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు ఇవ్వనున్నారు.


★ దివ్యాంగులకు (కళ్లు, చేతులు సహకరించనివారు) పరీక్షలు రాసేందుకు వీలుగా సహాయకుణ్ని అనుమతిస్తారు.


★ ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు, స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉంటారు.


★ కలెక్టర్ల పర్యవేక్షణలోనే పరీక్షలను నిర్వహించనున్నారు.


★ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.


★ నియమక పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ చేపడుతున్నామని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మ వద్దని అధికారులు సూచన.

40 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page