చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులకు 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఒంటరిగా ఉన్న పురుష ఉద్యోగులకు కూడా ఈ చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం కల్పించబడింది పిల్లలను దత్తత చేసుకుంటే పిల్లల వయస్సు ఒక సంవత్సరం లోపు వరకు మహిళ ఉద్యోగికి ఆరు నెలల పాటు జీతం తో కూడిన సెలవు ఇస్తూ ఉత్తర్వులు ఉదాహరణకు దత్తత తీసుకున్నప్పుడు పిల్లల వయస్సు ఆరు నెలలు అయితే మహిళా ఉద్యోగికి ఆరు నెలలు సెలవు మంజూరు చేస్తారు. రెండవ సందర్భం దత్తత తీసుకున్నప్పుడు పిల్లల వయస్సు 9 నెలలు అయితే మహిళా ఉద్యోగి మూడు నెలలు సెలవు మంజూరు చేస్తారు. దత్తత తీసుకున్న ఉద్యోగి పురుషుడైతే 15 రోజులు petarnity మంజూరు చేస్తారు పై నిబంధన ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఉద్యోగి గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ట్యూబర్క్యులోసిస్ తదితర అ రోగములతో బాధపడుతూ జీతం నష్టం సెలవులో ఉన్నప్పుడు వారికి ఎక్స్గ్రేషియా మంజూరు చేయబడుతుంది.
top of page
bottom of page