top of page
Writer's pictureAPTEACHERS

డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పోస్ట్ కోవిడ్ చికిత్సను చేర్చడం - ఆదేశాలు విడుదల.

Updated: Aug 23, 2021


డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పోస్ట్ కోవిడ్ చికిత్సను చేర్చడం - ఆదేశాలు విడుదల.

G.O.MS.No: 147. DT: 06/11/2020.


HM & FW విభాగం - డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పోస్ట్ కోవిడ్ చికిత్సను చేర్చడం - ఆదేశాలు - జారీ చేయబడింది.

పోస్ట్ కోవిడ్ మేనేజ్మెంట్ పథకం


★ కరోనా పాజిటివ్ గా నిర్ధారింపబడి, దీర్ఘకాలం (14రోజుల తర్వాత కూడా) అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సాయం అందించేందుకు పోస్ట్ కోవిడ్ మేనేజ్ మెంట్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ విడుదల చేసింది.


★ వారికి వారం రోజుల పాటు రోజుకు రూ.2,930 చొప్పున వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధికసాయం అందిం చాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


★ అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ పథకం తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.


★ ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ సిటీ స్కాన్లో 50శాతం పైబడి ఊపిరితిత్తులు పాడై అనారో గ్యంతో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆర్ధికంగా చేయూతనిస్తున్నామని తెలిపారు.


★ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదరోగులను ఆదుకునేందుకే పోస్ట్ కోవిడ్ మేనేజ్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.


5 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page