దసరా సెలవులు... suffix, preffix కొరకు వివరణ.
ప్రిఫిక్స్ - సఫిక్స్ S.R-5 Under FR 68: FR 82 (2) ప్రకారంగా 15 రోజులకు మించిన సెలవును వెకేషన్ అని అంతకు తక్కువగా ఉన్న సెలవులను షార్టర్మ్ సెలవులని అంటారు. వెకేషన్ కాలంలో పాఠశాల మూసివేసే రోజుకాని, తెరిచే రోజుకాని హాజరైనా సరిపోతుంది. కానీ షార్టర్మ్ సెలవులు ప్రకటించే దసరా, సంక్రాంతి సెలవులకు మాత్రం పాఠశాల మూసివేసే రోజు, తెరిచే రోజు 2 రోజులు తప్పక హాజరు కావాలి. (Rc.No. 10324/E4-2/ 69, dt : 7.11.1969)
దసరా, సంక్రాంతి సెలవులు 10 రోజులలోపుగా ఇచ్చినప్పుడు మాత్రమే మూసివేసే రోజు, కానీ తెరిచే రోజుకాని సాధారణ సెలవు పెట్టుకోవచ్చు. వేసవి సెలవులకు ముందు పాఠశాల మూసివేసే రోజుకాని, సెలవుల అనంతరం తెరిచే రోజుకాని హాజరుకానప్పుడు సాధారణ సెలవు కాకుండా సంపాదిత/ అర్ధవేతన సెలవు మాత్రమే మంజూరు చేయాలి.
షార్టర్మ్ సెలవులు స్థానిక సెలవు దినములతో కాకుండా ప్రభుత్వ సెలవు దినములతో కలిపి 15రోజులు మించిన సందర్భంలో సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ చేసుకొనవచ్చును.