top of page

పేద విద్యార్థులకు ఆర్థిక ఆసరా...NMMS 

పేద విద్యార్థులకు ఆర్థిక ఆసరా..NMMS 🔅పాఠశాల స్థాయిలో ప్రతిభ గల పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. వాకి చదువుకు ఉపయోగపడేలా ప్రోత్సాహకాలు అందజేసేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ మీన్స్‌ అండ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) ప్రతిభ పరీక్ష అమల్లోకి తెచ్చింది. ఈ పరీక్షను ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 8 వ తరగతి విద్యార్థులు అర్హులు. అర్హత సాధించిన వారికి ఇంటర్మీడియట్‌ వరకు ఏటా రూ. 12 వేలు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 🔅ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో సెప్టెంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 🔅ఈ ఏడాది నవంబరు 3న ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 🔅దరఖాస్తుకు అర్హతలు.🔅 🔅ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులై ఉండాలి. 🔅కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలి. 🔅7వ తరగతిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 🔅తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు. 🔅పరీక్ష ఫీజు రూ. 100 చెల్లించాలి. 🔅పాఠశాల వివరాలు, ఆధార్‌ నెంబర్‌, సెల్‌ నెంబరు, విద్యార్థి పేరు మీద బ్యాంక్‌ ఖాతా కలిగి ఉండాలి.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page