top of page

పెన్షనర్లకు I.R మరియు D.R చెల్లింపుపై ట్రెజరీ వారి వివరణ

పెన్షనర్లకు I.R మరియు D.R చెల్లింపుపై ట్రెజరీ వారి వివరణ GO.MS.No.61 Fin. Dt :18-7-2019 & Circular Memo No.D4/1380/2019, Dt:26-7-2019 DTA (RPS-2015 వేతన స్కేల్ ప్రకారంగా ఫ్యామిలీ / సర్వీస్ పెన్షన్ పొందే వారికి మాత్రమే 27% ఐ.ఆర్ వర్తించును.) A) NORMAL PENSION (DR Group -O) ఒక రిటైర్ అయిన ఉద్యోగి సర్వీసు పెన్షన్ గాని లేక ఫ్యామిలీ పెన్షన్ గాని ఏదో ఒకటి మాత్రమే లబ్ది పొందుచున్నచో వీరికి Basic Pension పై D.R మరియు IR లు రెండు పొందుటకు అర్హుడు (Allowed D.R&IR on Normal Pension) B) FAMILY PENSION having Employment on Compassionate Grounds (DR Group -1) ఒక ఉద్యోగి మరణించిన సందర్భంలో, వారి భార్య /భర్త గానీ ఫ్యామిలీ పెన్షన్ పొందుతూ మరియు కారుణ్య నియామకం ద్వారా కూడా ఉద్యోగం చేయునపుడు వీరు తీసుకునే బేసిక్ ఫ్యామిలీ పెన్షన్ పై D.R మరియు I.Rలు రెండు పొందుటకు అనఅర్హుడు. కానీ ఉద్యోగంలో పొందు బేసిక్ పే పై D.A & I,R పొందుటకు అర్హులు. (Not Allowed DR & IR on Family Pension) Note : ఉద్యోగి యొక్క భార్య / భర్త ఫామిలీ పెన్షన్ పొందుచూ, ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి కుమారుడు / కుమార్తె కారుణ్య నియామక ఉద్యోగం చేయుచున్న సందర్భం లో మాత్రమే ఇద్దరికి అనగా ఫ్యామిలీ పెన్షన్ పొందుచున్న భార్య / భర్తకు మరియు ఉద్యోగం చేయుచున్న కుమారుడు/ కుమార్తె కు DA మరియు I.R పొందుటకు అర్హులు అని గమనించాలి. 3. Drawing Two Pensions i.e., Service & Family Pension (DR Group - 2) ఒక ఉద్యోగి యొక్క భార్య /భర్త ఫ్యామిలీ పెన్షన్ పొందుతూ మరియు వీరు కారుణ్య నియామకం ద్వారా కాకుండా Direct Recruitment ద్వారా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన సందర్భంలో Service Pension కూడా పొందుచున్నప్పుడు మాత్రము. Family Pension పై డిఆర్ పొందుటకు అర్హత లేదు, కానీ రెండు Service & Family Pensionపై I.R పొందుటకు అర్హులు, (Not Allowed DR on Family Pension But Allowed I. R. on Two Pensions) 4. Family Pension having Employment on Direct Recruitment (Self) (DR Group 3) ఒక ఉద్యోగి యొక్క భార్య / భర్త ఫ్యామిలీ పెన్షన్ పొందుతూ మరియు కారుణ్య నియామకం ద్వారా కాకుండా Direct Recruitment ద్వారా ఉద్యోగం చేయుచున్న సందర్భంలో తీసుకునే ఫ్యామిలీ పెన్షన్ పై డి.ఆర్ పొందుటకు అర్హుడు, కాని Family Pension పై IR పొందుటకు అర్హుడు కాదు. (Allowed DR on Family Pension But Not Allowed I.R. on Family Pension) Note: GO.MS.No.51 Finance & Planning Dt :8-5-2015 లోని పేరా 21 ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న భార్య/ భర్త మరియు వీరే కారుణ్య నియామకం క్రింద నియమింపబడినచో ఫ్యామిలీ పెన్షన్ పై గాని లేక ఉద్యోగంనందు పొందు Basic Pay పై కాని ఏది, లబ్దిగా ఉంటే దానిపై మాత్రమే D.R వచ్చును. అంత్యక్రియల ఖర్చు : GO.MS.No. 91 F & P Dt: 13-4-2016 ప్రకారంగా సర్వీసులో ఉన్న ఉద్యోగి మరణించినచో రూ.15,000/-లు అంత్యక్రియలు ఖర్చు క్రింద మంజూరు చేయబడును. అదే పెన్షనర్ మరణించినప్పుడు GO.MS.No. 39 Finance Dt:8-8-2016 ప్రకారంగా కనీసం రూ.15,000/-లు లేక వీరు పొందుచున్న Basic Pension + D.R మొత్తంలో ఏది లబ్దిగా ఉంటే ఆ మొత్తం పొందుటకు అర్హులు. దీనిపై I.R, Medical Allowance మరియు Addition quantum Pension మంజూరు చేయుటకు అవకాశం లేదని Cir. MemoNo.D4/1380/2019 of 26-7-2019 of Director of Treasuries and Accounts వారు ఉత్తర్వులు జారీ చేసియున్నారు.

37 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page