ప్రశ్న: ఎవరైనా ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహించుట కొరకు బయలుదేరేటపుడు మధ్యలో ఎక్కడైనా ఆక్సిడెంట్ జరిగి గాయలై హాస్పిటల్ లో చేరితే ఆ ఉద్యోగి ఎటువంటి సెలవులు పొందవచ్చు?
సమాధానం: ప్రభుత్వ ఉద్యోగులు / ఉపాధ్యాయులు తాను ఉద్యోగ బాధ్యత నిర్వహణలో ఉన్న సమయంలో గాని, లేదా ఎన్నికల విధులు నిర్వర్తించుచున్న సమయంలో గాని, కార్యాలయం పనికై తమ కార్యాలయం నుండి లేదా కోర్టు కేసు విషయంలో వెళ్లుచున్నపుడు గాని, ఏదైనా రోడ్ ఆక్సిడెంట్ కు గురయినపుడు వైద్యుల సిపారసు మేరకు మూడు నెలల వరకు స్పెషల్ డీసెబిలిటీ లీవ్ మంజూరి చేయవచ్చును. రెండు నెలల వరకు అయితే గవర్నమెంట్ మెడికల్ అధికారి నుండి తెచ్చిన ధ్రువీకరణ సరిపోవును.
ఒకవేళ మొదటిసారి చికిత్స తరువాత అంగవైకల్యం తిరిగి పునరావృతము అయి డీసెబిలిటీ ఏర్పడితే తిరిగి ఈ సెలవు పొందవచ్చు. ఈ డెసెబిలిటీ లీవ్ కు 2 నెలలకు మించినదయితే సివిల్ సర్జెన్ గారు వైద్య ధ్రువపత్రము జారీ చేస్తారు కానీ మొత్తం ఈ సెలవు 24 నెలలకు మించరాదు.
కార్యాలయము నుండి ఇంటికి లేదా ఇంటి నుండి కార్యాలయమునకు ప్రయాణించునపుడు యాక్సిడెంట్ జరిగితే సెలవుకు అర్హులు కాదు.
ఈ డెసెబిలిటీ సెలవును ఇతర సెలవులతో కలిపి పొందవచ్చును.
ఈ సెలవు పెన్షన్ కు డ్యూటీగా లెక్కించబడును.
మొదటి 4 నెలల వరకు పూర్తి వేతనం లభించును. ఆ తరువాత కాలమునకు అర్ధవేతనము సెలవుగా లెక్కించి సగము వేతనం లభించును.