💥ఏపీలో 'పోస్టల్' ఉద్యోగాల జాతర
ఏపీలో 'పోస్టల్' ఉద్యోగాల జాతర.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
ఇండియా పోస్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం పదోతరగతి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
హైలైట్స్
అక్టోబరు 15 నుంచి నవంబరు 14 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశంఅక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు అందుబాటులోఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.గ్రామీణ్ డాక్ సేవక్: 2707 పోస్టులు
పోస్టులు..
➤ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (BPM)
➤ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM)
➤డాక్ సేవక్ (DS)అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 15.10.2019 నాటికి 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100. పోస్టాఫీసులో ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా.ముఖ్యమైన తేదీలు:
➥ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019
➥ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2019.
పూర్తి వివరాలు కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.👇
https://drive.google.com/file/d/1xbvEy1en0a1gUZv7neV18G3xtdvZQfdh/view?usp=drivesdk