బ్రిడ్జి కోర్స్ బేస్ లైన్ టెస్ట్ గైడ్లైన్స్
➧ బేస్ లైన్ టెస్ట్ ను 16.03.2020 వ తారీకు ఉదయం అన్ని యాజమాన్యాల (except Private primary schools )ప్రాధమిక తరగతులకు (1 to 5 ) పరీక్ష నిర్వహించవలెను.
➧ పరీక్ష రోజున CRP ల నుండి ప్రధానోపాధ్యాయులు ప్రశ్న పత్రాలు తీసుకొనవలెను. ➧ Base line Test కు 1 నుండి 5 తరగతుల విద్యార్థులందరకు తెలుగు & ఇంగ్లీష్ మీడియంలకు కలిపి ఒకే ప్రశ్న పత్రము ఉంటుంది. ఉర్థు మీడియం వారికి సెపరేట్ పేపర్ ఉంటుంది.
➧ పరీక్ష మొత్తం 50 మార్కులకు గాను తెలుగు 15 మార్కులు, గణితం 15మార్కులు ఇంగ్లీషు 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించ బడుతుంది.
➧ ఈ Baseline test లో పొందే మార్కులు ఆధారంగా విద్యార్థులను 1 వ స్థాయి, 2 వ స్థాయి లు గా విభజిస్తారు.
➧ తెలుగు, గణితములో 8 మార్కుల కన్నా తక్కువ, ఇంగ్లీష్ లో 10 మార్కుల కన్నా తక్కువ పొందే విద్యార్థు లను 1 వ స్థాయి గాను ,తెలుగు, గణితములో 8 మార్కుల కన్నా ఎక్కువ, ఇంగ్లీష్ లో 10 మార్కుల కన్నా ఎక్కువ పొందే విద్యార్థు లను 2 వ స్థాయి గాను విభజిస్తారు.
➧ తదుపరి విద్యార్థుల స్ధాయి కి అనుగుణముగా వర్క్ బుక్స్ లను DCEB ద్వారా ముద్రించి అందచేస్తారు.వీటితో పాటు స్కూల్ హ్యాండ్ బుక్ కూడా అందెజేస్తారు.
➧ఈ బ్రిడ్జి కోర్స్ కు విద్యార్థులందరు హాజరగునట్లు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి