top of page
Writer's pictureAPTEACHERS

మెడికల్ రియంబర్స్మెంట్ G.O.RT.No. 776,1-08-2022నుంచి 31-03-2023 వరుకు గడువు పొడగిస్తూ ఉత్తర్వు జారీ.

Updated: Oct 12, 2022

మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం చివరి సారిగా (Final Extension) 01-08-2022 నుంచి 31-03-2023 వరుకు గడువు పొడగిస్తూ ఉత్తర్వు జారీ.


మెడికల్ రియంబర్స్ మెంట్ గడువు పొడిగింపు


ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెడికల్ రీయంబర్స్మెంట్ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుండి 2023 మార్చి 31వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి ఎంటీ క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్ఎస్)తో పాటు మెడికల్ రిఎంబర్స్ మెంట్ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్ఎస్ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సిఇవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని < ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఆరోగ్యశ్రీ సిఇవో ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చేసారు.


AP Medical Reimbursement Scheme Extended upto 31.03.2023 G.O.RT.No. 776 Dated: 11-10-2022.


18 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page