top of page
Writer's pictureAPTEACHERS

మన బడి :: నాడు - నేడు STMS లాగిన్ లో అప్లోడ్ చేయడం ఎలా ?

STMS లాగిన్ లో అప్లోడ్ చేయడం ఎలా ?

1. *MOU:* stms.ap.gov.in నందు HM Login అయ్యాక, Title bar లో ఎడమ వైపునఉన్న

*APPROVALS* పై క్లిక్ చేసి, మొదట work Approvals పై క్లిక్ చేయాలి.

అందులో Mandal, School ను select చేసికొని, క్రిందవున్న table పై క్లిక్ చేయాలి.

అపుడు దాని క్రింది భాగంలో కొన్ని వివరాలుతో *Generate MOU* అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన మీ పాఠశాలకు చెందిన Mou డౌన్లోడ్ అవుతుంది. దీనిని ప్రింట్ తీసుకొని, చివరి పేజీలో కమిటీచే సంతకాలు చేయించిన తర్వాత మరల ఇదే మెనూలో అప్లోడ్ చేయాలి.

2. *REGISTRATIONS* :- దీనిపై క్లిక్ చేసి, Account Registration నందు బ్యాంకు అకౌంటు వివరాలు submit చేయాలి.

3. *ESTIMATIONS* :- ఇందులోని Resolution పై క్లిక్ చేసి, మండలం, పాఠశాల ను సెలెక్ట్ చేసి, కమిటీ సభ్యుల సంఖ్య, తేదీ లను వేసి, మేస్త్రి, కమిటీ సభ్యుల తీర్మానం ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

4. *stms app* : stms.ap.gov.in. నందు *DOWNLOAD APK* పై క్లిక్ చేసి works grounding photos పై క్లిక్ చేసిపుడు *STMS(1.8.1).apk* డౌన్లోడ్ అవుతుంది.

ఈ యాప్ మీ మొబైల్ లో install చేసి, మీ పాఠశాల *U Dise Code* తో open చేసి పోటోలను అప్లోడ్ చేయాలి.


మన బడి :: నాడు - నేడు.


మన పాఠశాల లో జరిగే కార్యక్రమము ను మొబైల్ ద్వారా App లో submit చేయాలి. స్టెప్ 1 : మీ మొబైల్ లో ఇంటర్నెట్ మరియు లొకేషన్ ఆన్ చేయాలి.

స్టెప్ 2 : బ్రౌజర్ లో http://stms.ap.gov.in/STMSWorks అని టైప్ చేయాలి. స్టెప్ 3: పైన DOWNLOAD APK అనే టాబ్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయండి. WORKS GROUNDING PHOTOS పైన క్లిక్ చేయండి. స్టెప్ 4: వెంటనే ఆటోమేటిక్ గా stms(1.8.1).apk download అవుతుంది. దానిని instal చేసుకోవాలి. స్టెప్ 5: మీ పాఠశాల UDISE code ను ఎంటర్ చేయండి. మీ పాఠశాల వివరాలు కనపడతాయి. స్టెప్ 6 : Capture photo పైన క్లిక్ చేయండి. కెమెరా ఓపెన్ అవుతుంది. ఫోటో తీసి , save button క్లిక్ చేస్తే ఆ ఫోటో టెంపరరీ గా సేవ్ అవుతుంది. ఆ ఫోటో బావుంది అనిపిస్తే ....Submit button click చేయండి. సిగ్నల్ లేని పాఠశాలలు ఈ క్రింది విదంగా ఫొటోస్ అప్లోడ్ చేయాలి. స్టెప్ 1 : పాఠశాల కు వెళ్లే ముందు ముందుగా సిగ్నల్ వున్న ప్రాంతం లో STMS App download చేసుకొని , UDISE code enter చేసి , మీ పాఠశాల వివరాలు చూడాలి. అలా ఉంచి పాఠశాలకు బయలుదేరాలి. స్టెప్ 2 : ఇంటర్నెట్ సిగ్నల్ లేని స్కూల్ కు వెళ్లి కార్యక్రమం ఫోటో capture చేసి ...Save button click చేయాలి.

సిగ్నల్ లేకపోయినా GIS coordinates automatic గా capture చేస్తుంది.

స్టెప్ 3:

సిగ్నల్ ఉన్న ప్రాంతం నకు వచ్చి , ఇంటర్నెట్ మరియు లొకేషన్ ఆన్ చేసి submit button click చెయ్యాలి.

Recent Posts

See All
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page