top of page
Writer's pictureAPTEACHERS

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో అవకాశం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆహ్వానం.

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో అవకాశం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆహ్వానం వివరాలు.

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). ఇందులో భాగంగానే ఈ ఏడాది మేలో నిర్వహించనున్న ‘యువికా- యువ విజ్ఞాని’ కార్యక్రమం కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులకు ఉన్న ఆసక్తిని గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇస్రో అధిపతి శివన్‌ దీనికి శ్రీకారం చుట్టారు. ఎంపికైన విద్యార్థులకు అన్ని ఖర్చులతోపాటు, సామగ్రి, ఇతర వసతులను సమకూరుస్తుంది.

దేశంలోని అహ్మదాబాద్‌, బెంగళూరు, షిల్లాంగ్‌, తిరువనంతపురం కేంద్రాల్లో మే 11 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాల శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించిన అన్ని వివరాల కోసం 080-22172269 నంబరులో సంప్రదించవచ్చు.

ఎంపిక ఇలా..

ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం. వారు ఫిబ్రవరి 3 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారి జాబితా ప్రకటన: మార్చి 2 ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయడానికి చివరి తేదీ: మార్చి 23 తుది జాబితా విడుదల: మార్చి 30 అర్హత: 2019-20 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్నవారు. వెయిటేజీ: 8వ తరగతిలో సాధించిన మార్కులను బట్టి 60శాతం వెయిటేజీ, 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వ్యాసరచన, చర్చా కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన వారికి 10 శాతం, క్రీడల్లో ప్రతిభకు 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదివే వారికి 15 శాతం.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page