top of page

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కోసం నిరీక్షణ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కోసం నిరీక్షణ


Circular Memo No.H5/7668/2014 dated:03-04-2020

Disaster Management Act, 2005 – COVID-19 Pandemic –

Payment of Salaries / Wages / Remuneration /Honorarium / Pensions-

Deferment of payment-Video Conference held by the DTA, AP, Ibrahimpatnam on 03-04-2020


జీతాలు, పెన్షన్ల కోసం నిరీక్షణ


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు ఇంకా జీతాలు, పెన్షన్లు అందలేదు.


*సస్పెన్షన్‌లో ఉన్నవారికి 50% వాయిదా వర్తించదు*


*ఖజానా శాఖ సంచాలకుల మార్గదర్శకాలు*


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 50% వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు సస్పెన్షన్‌లో ఉన్న వారికి వర్తించబోవు. వారికి సగం జీతం మాత్రమే అందుతున్నందు వల్ల వారికి ఈ ఉత్తర్వులు వర్తింపజేయాల్సిన అవసరం లేదని ఖజానాశాఖ సంచాలకులు హన్మంతరావు స్పష్టంచేశారు. ఈ మేరకు మెమోను జారీ చేశారు. ఉద్యోగులకు జీతాల వాయిదాకు సంబంధించి కొన్ని అంశాల్లో స్పష్టత ఇచ్చారు.


* చెక్‌ల రూపంలో జీతాలు పొందే ఉద్యోగులు కొందరు ఉంటారు. పీడీ ఖాతాల ద్వారా వారికి జీతాలు అందుతాయి. వారికి సైతం 50శాతం వాయిదా వర్తిస్తుంది. వారు సగం మొత్తం జీతాలు డ్రా చేసుకుని మిగిలిన మొత్తం ఆయా పీడీ ఖాతాల్లోనే ఉంచాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని ఏం చేయాలనేది తర్వాత నిర్దేశించనున్నారు.



* డీడీఓలు జీతాల బిల్లులు సమర్పించకపోతే 50శాతం బిల్లుల్లో కోత విధించి సమర్పించాలి.


* 2020 మార్చి నెలాఖరున పదవీ విరమణ చేసిన వారికి సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.


* ఇతర రాష్ట్రాల వారు ఎవరైనా ఈ రాష్ట్రంలో పింఛను పొందితే ఈ ఉత్తర్వులు వర్తించబోవు.


* ఛార్జెడ్‌ మొత్తాల నుంచి జీతాలు చెల్లింపులు చేసే గవర్నర్‌, శాసనసభ స్పీకర్‌, మండలి అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, న్యాయమూర్తులకు ఇది వర్తించబోదు. జిల్లాల్లో కోర్టుల సిబ్బందికి వర్తిస్తాయి.


* గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు.. ఎవరైతే రూ.5000, రూ.4000 గౌరవవేతనం పొందుతున్నారో వారికి వాయిదా ఉండదు. ప్రభుత్వ ఉత్తర్వులు వర్తించబోవు.


* పొరుగు సేవల సిబ్బందికి కూడా 10శాతం మొత్తం చెల్లింపులు వాయిదా వేస్తారు.


Click here to download minutes 👇


https://drive.google.com/file/d/1MurdibnCT8IWojTVMaZWnFJeEN3wOClg/view?usp=drivesdk



30 views

Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page