top of page
Writer's pictureAPTEACHERS

శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి?ఎవ‌రు అర్హులు?.

Salary Overdraft: శాలరీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి?ఎవ‌రు అర్హులు..


అత్యవసరంగా డబ్బు అవసరం పడిందా?రుణం మంజూరు కోసం వేచి చూసేంత సమయం లేదా! అయితే శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. మీరు జీతం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులైతే.. మీ శాలరీ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఈ సదుపాయం పొందచ్చు. అయితే, శాలరీ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ సదుపాయం లభించదు. అర్హత ఉన్న వారికి మాత్రమే ఇది లభిస్తుంది.


ఓవర్ డ్రాఫ్ట్ అంటే..

ఖాతాదారులు తమ ఖాతాలో ఉండే మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని ఉపసంహరించుకోవడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ లో మీరు ఖాతా నుంచి విత్ డ్రా చేసే వరకు వడ్డీ వసూలు చేయరు. మీరు తీసుకున్న అధిక మొత్తంపై మాత్రమే వడ్డీ చెల్లించవలసి వుంటుంది. సాధారణంగా పొదుపు, కరెంట్ ఖాతాలపై ఈ సదుపాయం అందిస్తున్నాయి.


శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ ..

మీ జీతం ఖాతాలో పొందగలిగే రివాల్వింగ్ క్రెడిటే శాలరీ ఓవర్ డ్రాఫ్ట్. మీకు డబ్బు అవసరమైనప్పుడు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌కు మించి నిర్దిష్ట మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీనిపై తిరిగి చెల్లించేంత వరకు వడ్డీ పడుతుంది. ఏక మొత్తంగా గానీ, వాయిదాలలో గాని అదనంగా విత్డ్రా చేసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఆర్థిక అత్యవసరాలలో ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. జీతం ఖాతాలో నిధుల కొరత కారణంగా చెక్ బౌన్స్ అవ్వడం, ఈఎమ్ఐ, సిప్ మిస్ అవ్వకుండా ఇది సహాయపడుతుంది.


ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉంటుంది?

బ్యాంకులు తమ పాలసీని అనుసరించి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఇది వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉంటుంది. వ్యక్తి క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోరు ఆధారంగా ఆ వ్యక్తి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని నిర్ణయిస్తారు. బ్యాంకు, ఖాతాను బట్టి ఒక్కోసారి శాలరీ కంటే మూడింతలు అధికంగా లిమిట్ ఉంటుంది. కొన్ని బ్యాంకులు నెట్ శాలరీలో 80 నుంచి 90 శాతం వరకు మాత్రమే అనుమతిస్తాయి.


నెట్ శాలరీ ఆధారంగా కొన్ని బ్యాంకులు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఆఫర్ చేస్తుంటే మరికొన్ని బ్యాంకులు రూ. 1 నుంచి రూ. 1.5 లక్షల వరకు, ఇంకొన్ని బ్యాంకులు రూ. 10వేల నుంచి రూ. 25 వేల వరకు మాత్రమే ఓవ‌ర్‌ డ్రాఫ్ట్‌ను ఇస్తున్నాయి. ఉదాహరణకి, హెచ్డీఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకులలో జీతం ఖాతా ఉన్న వారికి జీతంకు మూడు రెట్లు ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ను ఆఫర్ చేస్తుంటే, సిటిబ్యాంక్ సువిధ శాలరీ అకౌంట్ ఉన్న వారికి శాలరీపై ఐదింతల(రూ. 5 లక్షల వరకు) ఓవ‌ర్‌ డ్రాఫ్ట్‌ను ఇస్తుంది.


శాలరీ ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరికీ బ్యాంకులు ఓవ‌ర్‌ డ్రాఫ్ట్‌ ఆప్షన్ ఇవ్వవు. ఎంపిక చేసిన శాలరీ ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. రుణ చరిత్ర, అర్హతల ఆధారంగా ఎలిజిబిలిటినీ నిర్ణయిస్తారు. ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ ఖాతా తీసుకున్న వారికి ప్రాసెసింగ్ రుసుములు వర్తిస్తాయి. వార్షిక పునరుద్ధరణ రుసములు ఉంటాయి.


శాలరీ ఓవ‌ర్‌ డ్రాఫ్ట్‌ అనేది క్రెడిట్ కార్డు రుణం మాదిరిగా ఖరీదైన రుణంగానే చెప్పవచ్చు. వార్షిక వడ్డీ రేటు 12 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. చెల్లింపులు సమయానికి చేయకపోతే పెనాల్టీలు వర్తిస్తాయి. ఈ పెనాల్టీలు, ప్రాసెసింగ్ ఫీజులతో రుణం ఖరీదైనదిగా మారుతుంది. క్రెడిట్ కార్డుల మాదిరిగా వడ్డీ లేని కాలవ్యవధి ఉండదు. రివార్డు పాయింట్లు, ఆఫర్లు ఉండవు. విత్డ్రా చేసుకున్న రోజు నుంచి వడ్డీ వర్తిస్తుంది. అయితే మీ వద్ద డబ్బు ఉంటే ఒకేసారి మొత్తం రుణాన్ని చెల్లించే సదుపాయం ఉంటుంది. ఒకేసారి చెల్లించలేకపోతే.. నెలవారి వాయిదాలలో చెల్లించేందుకు ఈఎమ్ఐలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు.


ఓవర్ డ్రాఫ్ట్

సహాయ నిరాకరణ వలన ఈ నెల జీతం సోదరుల అకౌంట్స్ లో పడదు. ఆర్ధిక ఇబ్బంది అయితే శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ కి వెళ్లి ఓవర్ డ్రాఫ్ట్ ఇమ్మని అడగమని చెప్పండి. ఎందుకంటే మనది సాలరీ అకౌంట్ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. బ్యాంక్ లో ఫారం ఇస్తారు, దాని మీద సైన్ చేసి ఇస్తే మన జీతానికి అనుగుణంగా ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అకౌంట్ లో వేస్తారు. ఈ సహాయ నిరాకరణ/సమ్మె పరిస్థితి గమనించి, దానికి అనుగుణంగా 31st వరకు ఆగి, అప్పుడు వెళ్లి అప్లై చేస్తే 1st కి అకౌంట్ లో జమ చేస్తారు. Over Draft కావాలంటే:-. 1. Income tax return ( form - 16). 2. Aadhar card. 3. Pan Card. 4. Pro note with revene stamp. Bank Authorities కు ఇవ్వవలసి ఉంటుంది అని మనవి. Six Months లో Equal Instalments లో Recovery చేసుకుంటారు.

2 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page