top of page
Writer's pictureAPTEACHERS

సందేహం--సమాధానం

Updated: Aug 24, 2021

సందేహం--సమాధానం 👉ప్రశ్న: మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు?? జవాబు: సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ లో రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. 👉ప్రశ్న: FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా?? జవాబు: FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు. 👉ప్రశ్న: నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల?? జవాబు: జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి. 👉ప్రశ్న: నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము. SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు?? జవాబు: SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు. 👉ప్రశ్న: PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి?? జవాబు: PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు. 👉ప్రశ్న: ఒక టీచర్ 9 రోజులు APOSS పరీక్షల కోసం, మరియు 26 రోజులు SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం వేసవి సెలవులలో హాజరు అయ్యాడు.ఇపుడు ఆతనికి 35 ELs జమచేయబడతాయా?? జవాబు: మొత్తం కాలాన్ని కలిపి దామాషా ELs జమ చేయవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం జమ అయ్యే 6 రోజులు మీరు వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కంటే తగ్గిన యెడల పూర్తి సంపాధిత సెలవు 24 రోజులు జమ చేయబడుతుంది. ఇక్కడ 35 రోజులు పనిచేశాడు.14 రోజులే వేసవి సెలవులు ఉపయోగించుకొన్నందున అతనికి 24 రోజుల సంపాధిత సెలవు జమచేయవలసి ఉంటుంది.

Recent Posts

See All

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి?

సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి? ★ సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు...

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ

స్థానిక సెలవు APpeaLS లో -వివరణ స్థానిక సెలవు(LH) స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page