🔕అనుమతి లేని గైర్హాజరు సమాచారం:🔕
💥 సెలవు ఉద్యోగుల హక్కు కాదు.కానీ సర్వసాధారణంగా సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా విధులకు గైర్హాజరు అవుతూ ఉంటారు.అలాంటి ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా 106 మంది ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు 27.9.2019 న ఆర్.సి.నెం.2000/Ser.IV/2019 ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై వివరణ.
💥 అనుమతి లేకుండా ఉద్యోగి విధులకు గైర్హాజరు అయిన కాలాన్ని ఫండమెంటల్ రూల్-18 ప్రకారం *డైస్ నాన్* గా పరిగణిస్తారు.
💥 ఏ ఉద్యోగికి వరుసగా ప్రభుత్వ అనుమతి లేకుండా 5 సంవత్సరాలకు మించి ఏ రకమైన సెలవు మంజూరు చేయకూడదు. FR-18 and Rule 5A of AP Leave Rules-1933
💥 కానీ తదుపరి 1 సంవత్సరమునకు మించి గైర్హాజరు అయినా ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. G.O.Ms.No.11 Fin Dated: 13.1.2004 Read with G.O.Ms.No.260 GAD Dated:4.9.2003
💥 1 సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగి తన పదవికి రాజీనామా చేసినట్లు పరిగణించాలని ఫండమెంటల్ రూల్-18 కు సవరణ ఉత్తర్వులు. G.O.Ms.No.128 F&P Dt: 1.6.2007 జారీ చేసింది.
ఉద్యోగిపై చర్యలు తీసుకునే ముందు ఆ ఉద్యోగి తన వాదనను వినిపించు కొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను. Rule 5B of A.P Leave Rules-1933 మరియు G.O.Ms.No.129 F&P Dt: 1.6.2007
💥 విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ పరిస్థితుల్లోనైనా తన పదవికి రాజీనామా చేసిన ఎడల A.P.State Subordinate Service Rules-1996 లోని రూలు-39 ప్రకారం ఆమోదించవచ్చు.
💥 విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ కారణం చేతనైనా ఏ.పి రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూలు 43 మరియు 44 మేరకు స్వచ్ఛంద పదవి విరమణ చేయదలచుకున్న నిబంధనల మేరకు అనుమతించ వచ్చును. అలాంటి సందర్భాలలో కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొనవచ్చును. Govt.Cir.Memo.No.9101-4/8/FRI/91 Dt: 25.12.1991
💥 విధులకు అనుమతి లేకుండా గైర్హాజర్ అయినా ఉద్యోగి కొంతకాలం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో తిరస్కరించటం సరికాదు. అతనిని వెంటనే విధులలో చేర్చుకొని తదుపరి తగిన విధంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. Govt.Cir.Memo.No.9101-4/8/FRI/91 Dt: 25.12.1991