top of page
Writer's pictureAPTEACHERS

Attandance app నందు teachers leave management ను అప్డేట్ చేయడం ఎలా ?.

Updated: Nov 7, 2022

State IT Cell వారి ఆదేశాల ప్రకారం అందరూ Dy.EO/MEO/HM లు వారి పరిధిలో గల ఉపాద్యాయుల మరియు ఉద్యోగుల లీవ్ అకౌంట్ ని వెంటనే అప్డేట్ చేయించి వారి లీవ్ అకౌంట్ ను వెరిఫై చేసి DDO లు వెంటనే approve చేయవలెను. నవంబర్ 1 నుండి అందరూ టీచర్ల attendance స్టేటస్ (leave/OD/Deputation) స్కూల్ attendance app లో ఉండేలా తగు చర్యలను వెంటనే చేపట్టవలెను.  కావున ఈ లీవ్ module approval వెంటనే పూర్తి చేయవలెను.

Information for Male teachers leave management

1.EARNED LEAVE

(ఇవి సంవత్సర సర్వీస్ కి 6 వస్తాయి.సర్వీస్ ని బట్టి లెక్కించవలెను. ఏమైనా earned లీవ్స్ క్యాష్ చేసుకున్నట్లైతే availed దగ్గర చూపించాలి..ex-15/30/60...)

2.Extraordinary Leave-1461days

(ఇవి జీత నష్టపు సెలవులు ....app లో 1461 maximum తీసుకుంటుంది.ఏమైనా వాడుకొనినచో ఆ నెంబర్ availed దగ్గర ఎంటర్ చేయండి)

3.HALF PAY LEAVE

(commutation)

(ఇవి సంవత్సర సర్వీస్ కి 20 వస్తాయి.no. of days column లో మీ సర్వీస్ బట్టి నమోదు చేసుకొనవలెను.)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని ఫుల్ శాలరీ draw చేసినట్లయితే ఈ commutation దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు double చేసి నమోదు చెయ్యాలి.

4.HALF PAY LEAVE

(private affairs)

(ఇక్కడ కూడా no. of. days column దగ్గర అదే నెంబర్ ఎంటర్ చేయాలి)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని సగం శాలరీ draw చేసినట్లయితే ఈ private affairs దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు నమోదు చెయ్యాలి.

5.SPECIAL CASUAL LEAVES-7days

6.Special casual leave on spl occasions

(national/state events)

ఏమైనా తీసుకుంటే నెంబర్ వెయ్యండి లేకపోతే సున్నా పెట్టండి

7.Special casual leave on spl occasions-21 days

(Representing Recognised unions)

8.Special casual leave on spl occasions

(Participating in scouts/guides camps)

ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే సున్నా పెట్టండి.

9.Special casual leave on spl occasions-6days

(Vasectomy)

10.Special casual leave on spl occasions-7days

(Wife tubectomy operation)

11.CASUAL LEAVE-15 days

12. STUDY LEAVE-1825 days

13.PETERNITY LEAVE-30days

14.Special disability leave-730 days.

Information for Female teachers leave management

1.EARNED LEAVE

(ఇవి సంవత్సర సర్వీస్ కి 6 వస్తాయి.సర్వీస్ ని బట్టి లెక్కించవలెను. ఏమైనా earned లీవ్స్ క్యాష్ చేసుకున్నట్లైతే availed దగ్గర చూపించాలి..ex-15/30/60...)

2.Extraordinary Leave-1461days

(ఇవి జీత నష్టపు సెలవులు ....app లో 1461 maximum తీసుకుంటుంది.ఏమైనా వాడుకొనినచో ఆ నెంబర్ availed దగ్గర ఎంటర్ చేయండి)

3.HALF PAY LEAVE

(commutation)

(ఇవి సంవత్సర సర్వీస్ కి 20 వస్తాయి.no. of days column లో మీ సర్వీస్ బట్టి నమోదు చేసుకొనవలెను.)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని ఫుల్ శాలరీ draw చేసినట్లయితే ఈ commutation దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు double చేసి నమోదు చెయ్యాలి.

4.HALF PAY LEAVE

(private affairs)

(ఇక్కడ కూడా no. of. days column దగ్గర అదే నెంబర్ ఎంటర్ చేయాలి)

హాఫ్ పే లీవ్ పెట్టుకొని సగం శాలరీ draw చేసినట్లయితే ఈ private affairs దగ్గర availed column లో ఎన్ని రోజులు సెలవు పెడితే అన్ని రోజులు నమోదు చెయ్యాలి.

5.SPECIAL CASUAL LEAVES-7days

6.Special casual leave on spl occasions

(national/state events)

ఏమైనా తీసుకుంటే నెంబర్ వెయ్యండి లేకపోతే సున్నా పెట్టండి

7.Special casual leave on spl occasions-21 days

(Representing Recognised unions)

8.Special casual leave on spl occasions

(Participating in scouts/guides camps)

ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే సున్నా పెట్టండి.

9.Special casual leave on spl occasions-14days

(Tubectomy)

10.Special casual leave on spl occasions-21days

(Recanalization of tubectomy operation)

11.CASUAL LEAVE-15 days

12. STUDY LEAVE-1825 days

13.Maternity leave-360days

14.Child care leave-180 days

15.Abortion leave-42 days

16.Special disability leave-730 days

17.Casual leave(Additional for women)-5days.

EARNED LEAVE.

Maximum credit balance will applicable 300 days.

మనం మొత్తం service లో ప్రతి సంవత్సరం 15 రోజులు వరకు EL encashment ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చ కానీ leave credit మాత్రం credit చేస్తున్న ప్రతిసారి 300 కు మించకూడదు.

కావున leave credit avail విషయంలో మనం june 2022 వరకు ఉన్న ప్రస్తుత క్రెడిట్ balance నమోదు చేసి ఈ సంవత్సరం జనవరి 2022 నుంచి జూన్ 2022 వరకు EL ఉపయోగించి ఉంటే వాటిని leave availe లో చూపించగలరు. లేనియెడల zero చూపవచ్చు.

Maternity leave

వివాహిత మహిళ ఉద్యోగిని కి ఇద్దరు పిల్లల వరకు కాన్పు సమయంలో ఒక పర్యాయం 180 రోజులు చొప్పున 2 సార్లు తీసుకోవచ్చు.అంటే 360 రోజులకు పరిమితం.

Paternity leave

వివాహ పురుష ఉద్యోగికి ఇద్దరు పిల్లల వరకు జనన సమయంలో రెండు పర్యాయములు 15 రోజుల చొప్పున 30 రోజులకు పరిమితం.

Child care leaves

మహిళ ఉద్యోగికి పిల్లల సంరక్షణ నిమిత్తం పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు వచ్చు వరకు,disable children కు 22 సంవత్సరాల వరకు 3 spells వారీగా 180 రోజుల వరకు ఉపయోగించవచ్చు.child care leave can not be demanded as matter of right.It requires the prior proper approval of the leave sanction authority.

Study leave

2 సంవత్సరాల కాల పరిమితి(730 రోజులు) తో study leave ఉన్నతాధికారుల అనుమతి తో మంజూరు చేయవచ్చు.

Leaves ప్రతి సంవత్సరం update చేయబడతాయి.కావున DDO గారికి edit option ఇస్తారు.అందరూ వ్యక్తిగతంగా వారి leave management ను అప్డేట్ చేయగలరు.

Attendance App లో టీచర్ల సెలవులు Update చేయడానికి కొన్ని సూచనలు.

146 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page