top of page

CFMS HELPDESK లో Login అవడం ఎలా ?

Updated: Aug 23, 2021

CFMS లో మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని rectify చేసుకోవడానికి CFMS Help Desk లో incident rise చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఇదివరకే మీకు CFMS Help Desk లో login అవడానికి User Id గా మీ CFMS నంబరు ఇస్తారు. Password మీరు ఇదివరకు set చేరుకున్నది ఇస్తారు.


కానీ ప్రస్తుతం దీనిని ప్రతీఒక్కరూ మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కారణం login site మార్చారు.


కావున కింది లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.



ఈ పేజీలో User Id గా మీ CFMS నంబరు ఇవ్వగానే మీ మొబైల్ నంబరు కింద DISPLAY అవుతుంది. దీని కిందుగానే GET OTP ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే మీ మొబైల్ కు 6 అంకెల OTP వస్తుంది. దీనిని

GET OTP కింద ఉన్న బాక్స్ లో నమోదు చేసి Login with OTP మీద క్లిక్ చేస్తే మరొక పేజీ OPEN అవుతుంది.


ఇక్కడ మీరు కొత్తగా ఒక PASSWORD ను SET చేసుకోవాల్సి ఉంటుంది.


ఇకమీదట మనకు CFMS లో/కు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఈ HELPDESK లో Login అయ్యి incident పెట్టడం(మన DDO గారి Covering letter తో) ద్వారా సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుంది.


గమనిక


Login లో CFMS Id enter చేసినప్పుడు మీ మొబైల్ నంబరు కన్పిస్తుంది కదా! ఇక్కడ మీ మొబైల్ నంబరు ను ఒకసారి check చేసుకోండి. మీ మొబైల్ నంబరు తప్పుగా display అయినట్లయితే మీ DDO గారి దృష్టికి తీసుకెళ్లినట్లయితే వారు మార్చగలరు.


సూచన


భవిష్యత్ లో ప్రతీదీ CFMS ద్వారానే అన్నీ లావాదేవీలు/బదిలీలు/పదోన్నతులు/ఉద్యోగ విరమణ ఫలాలు/సెలవులు/ఇంక్రిమెంట్లు ఉంటాయి కాబట్టి ప్రతీఒక్కరూ దీనిపై శ్రద్ధ వహించవలసినదిగా నా సూచన


תגובות


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page