top of page
Writer's pictureAPTEACHERS

CPS విధానం ఎంత లోప భూయిష్టం- CPS పై ( ఖజనా శాఖ) వారి విశ్లేషణ.

CPS విధానం ఎంత లోప భూయిష్టం- CPS పై ( ఖజనా శాఖ) వారి విశ్లేషణ.



ప్రాథమిక అవగాహన ఉంటే ఇలా చెప్పరు. పెన్షన్ వల్ల ప్రభుత్వం పై భారం పడుతోంది అనేది పైకి కనిపించే ఒక అందమైన అబద్ధం.  ఎందుకంటే ఓ నలభై ఏళ్ల క్రితం ప్రభుత్వ బడ్జెట్ లో జీతాల, పెన్షన్ ల భారం ఎంత ఉందో, ఎప్పుడూ అంతే ఉంది తప్ప ఏ మాత్రం పెరగలేదు.

అలాగే CPS అనేది వాస్తవం గా చెప్పాలంటే ప్రభుత్వాలు భరించలేని భారం. దాని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రస్తుతం CPS ఉద్యోగులు తక్కువ వేతన జీవులు. అలాగే ఇప్పటికే 50% మంది మాత్రమే ఉన్నారు. ఈ మాత్రం దానికే ప్రభుత్వ వాటా చెల్లించడానికి ఆపసోపాలు పడుతున్నారు. 10 నెలలు గా సుమారు 3000 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది.  రిటైర్ అయిన వారి GPF చెల్లించలేక ఆపసోపాలు పడుతోంది. దీనికి కారణం ఇదే CPS నే.

CPS విధానం ఎంత లోప భూయిష్టం అనేది ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్ నే ఒక మంచి ఉదాహరణ. CPS లో ప్రభుత్వ వాటా గా ఎంత సొమ్ము చెల్లిస్తే అంత మేరకు ప్రభుత్వం నిర్దేశిత పరిమితి దాటి అప్పు చేసుకోవచ్చు. ఉన్నట్టుండి ఎందుకు కేంద్రానికి అంత ఉదార స్వభావం? రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల CPS రద్దు ప్రభావం. నిజానికి ఆ రాష్ట్రాల్లో CPS పట్ల కాస్త అసంతృప్తి ఉన్నా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు ఏమీ చేయలేదు. ప్రభుత్వం తో చర్చలు ఏమీ చేయలేదు. రద్దు చేస్తామని ఎన్నికల హామీ ఏమీ ఇవ్వలేదు. అదే విధంగా మరీ దగ్గరలో ఎన్నికలు కూడా ఏమీ లేవు. మరెందుకు ఉన్న పళంగా ఆఘ మేఘాల మీద రద్దు చేసేశారు. ఒక చిన్న డిమాండ్ కోసం మన నాయకులు 10 సార్లు తిరిగితే తప్ప కనీసం కదలిక కూడా రాదు. మరెందుకు ఉన్న పళంగా ఉద్యోగులపై అంత ప్రేమ పుట్టుకు వచ్చింది.


పైకి ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరించినట్లు కనిపించినా పైకి కనిపించని మరో అంశం. దీనిని భరించలేని పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగితే క్రమక్రమంగా ఒక్కొక రాష్ట్రము ఇదే బాట పడతాయని గ్రహించిన కేంద్రం వెంటనే ఉదారత చూపింది. CPS పై ప్రభుత్వం ఎంత చెల్లిస్తే అంతా అదనంగా అప్పు చేసుకోవడానికి ఉదారంగా వెసులు బాటు ఇచ్చింది. 40-50 ఏళ్ల తరువాత CPS వల్ల ప్రభుత్వాలపై పెన్షన్ భారం తగ్గుతుంది అనే కదా ఈ విధానం తీసుకు వచ్చింది. కానీ, ప్రస్తుత పరిస్థితి ఏమిటి అప్పులు చేసి ప్రభుత్వ వాటా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చేసిన అప్పులు 15-25 ఏళ్ల తరువాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ ఈ అప్పులు తీర్చడానికి కూడా మళ్లీ అప్పులు చెయ్యాలి. అదే పాత పెన్షన్ విధానం లో ఇంత భారం ఉండదు.


పైన ఒక మాట చెప్పాను. GPF లు తిరిగి చెల్లించలేక పోతున్నాయి అని. CPS కి GPF కి ఉన్న సంబంధం ఏమిటి?


ఉద్యోగుల GPF ఖాతాల్లో ఉన్న సొమ్ము ప్రభుత్వ నియంత్రణ లోనే ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు GPF లో ఉంటుంది. 20 ఏళ్ల క్రితం తీసుకుంటే GPF లో 100 జమ అయితే 10 WITHDRAW అయ్యేది. అది అలా కొనసాగుతూనే ఉండేది. అందువల్ల ప్రభుత్వానికి ఎప్పుడూ లోటు కనపడదు. GPF జమ చేసిన సొమ్ము ప్రభుత్వం ఏమీ లాకర్ల లలో దాచి ఉంచదు. తన అవసరాలకు ఉపయోగించుకుని తిరిగి ఇవ్వాల్సి వచ్చినపుడు ఇస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి నిధుల లభ్యత పెరుగుతుంది.బయట నుండి అప్పులు ఏ తెచ్చు కావాల్సిన అవసరం తప్పుతుంది. ఎప్పుడో కూడా జమ అయ్యే మొత్తం ఎక్కువ WITHDRAW చేసేది తక్కువ ఉండటం వల్ల ఎప్పుడూ ప్రభుత్వానికి ఇబ్బంది రాదు.

CPS పెట్టిన తరువాత జరిగింది ఏమిటి? PF ఖాతా దారులు తగ్గుతూ వస్తున్నారు. జమలు తగ్గుతూ వస్తున్నాయి. రిటైర్ అయ్యే కొద్దీ WITH DRAW లు పెరుగుతున్నాయి. ఎప్పుడో వడేసుకున్న సొమ్ము తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి.


మరో పక్క CPS లో మినహాయించి న మొత్తం ప్రభుత్వ వద్ద ఉండకపోగా, డానికి అంతే మొత్తం జమ చేసి మరీ చెల్లించాలి.


అంటే ఒక్కమాటలో చెప్పాలంటే ఎప్పుడూ పాతికేళ్ళ క్రితం వాడేసుకున్న డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది.


ఎప్పుడో పాతికేళ్ళ తరువాత చెల్లించాల్సిన పెన్షన్ ఇప్పుడే చెల్లించాల్సి వస్తోంది.


ఇప్పుడు జీతం ఎలాగా ఇప్పుడే చెల్లించాలి.

దీని పర్యవసానం. GPF సొమ్ము చెల్లించలేక పోవడం. CPS ప్రభుత్వ వాటా కోసం అప్పులు చేయడం. పదవీ విరమణ చెందిన వారికి చెల్లించలేక పదవీ విరమణ వయసు వాయిదా వేసుకుంటూ పోవడం.

ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగులకు తగిన సెక్యూరిటీ లేదు. ప్రభుత్వాలు భరించలేవూ.

మరి ఎవరికీ ఉపయోగం.


ప్రభుత్వానికి నిధుల కొరత - అప్పులు, ఫండ్ మేనేజర్లకు,కంపెనీలకు నిధుల లభ్యత - పెట్టుబడులు.

అసలు ప్రభుత్వ ఉద్యోగులకు పనేమీ చేయించు కోకుండా పెన్షన్ ఎందుకు చెల్లించాలి? ఒక సారి కండక్ట్ రూల్స్ చూడండి.


1. ప్రభుత్వ ఉద్యోగి నిబంధనల మేరకు తన జాబ్ తప్ప మరే అదయార్జన కలిగే వ్యాపారాలు చేయకూడదు. పార్ట్ టైం జాబ్ లు చేయకూడదు. పెట్టబడులు పెట్టీ - కంపెనీలలో భాగస్వామ్యం కలిగి ఉండకూడదు. ట్రేడింగ్ లాంటి స్పెక్యులేషన్ చేయకూడదు. యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ లు కూడా ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించ కూడదు. ఆదాయం సంపాదించ కూడదు.


2. ప్రభుత్వ ఉద్యోగులు తమ కు నచ్చినట్లుగా స్వేచ్చగా స్థిర చరాస్తులు కొనుక్కునే అవకాశం లేదు. ప్రతీ దానికీ లెక్కలు చెప్పాలి, అనుమతి పొందాలి.


3. ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకుల నుండి మినహా అప్పులు కూడా చేయకూడదు. డబ్బులు ఎక్కువగా ఉన్నా వడ్డీలకు అప్పులు ఇవ్వకూడదు.


4. ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు, 365 రోజులు కూడా విధులకు అందుబాటులోనే ఉండాలి.  నిర్దిష్టమైన సమయం, పనిగంటలు ఉండవు. అందువల్ల అదనపు సమయం పని చేయడం అనేది ఉండదు (24 గంటలు డ్యూటీ గా పరిగణిస్తారు కాబట్టి) అదనపు చెల్లింపులు ఉండవు.


5. ప్రెస్, మీడియా తో మాట్లాడకూడదు.


6. ప్రభుత్వ విధానాలను విమర్శించ కూడదు.


7. చివరకు జీత నష్టపు సెలవులో ఉన్నా, సస్పెన్షన్ లో ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా సంపదించు కోవడానికి  వీలు లేదు. అప్పులు చేయడానికి వీలు లేదు. అడుక్కుని కూడా తినకూడదు. (ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించ కూడదు)


8. ఎంత ప్రతిభ ఉన్నా దానిని మనం రూపాయి గా మార్చుకోవడానికి అవకాశం లేదు.


ఇలా ఎన్నో రకాల restrictions మధ్య ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది.


ఒక పని చేయమని చెప్పండి. పైవన్నీ మర్చేయమని చెప్పండి. కార్మిక చట్టాలు వర్తించే వారిలాగా గంటలు నిర్దేశించ మని చెప్పండి. మిగిలిన సమయం మనకు నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ ఇవ్వమని చెప్పండి. అసలు నాకు OPS అవసరం లేదు, CPS కూడా అవసరం లేదు. నా జీతం ఎంత వస్తుందో, దానికన్నా ఎక్కువ మొత్తం అదనంగా నేను సంపాదించుకోగలను.

సంపాదించుకునే ఓపిక, వయసు ఉన్నంత కాలం ఉన్న తెలివినీ, శ్రమను, ఓపిక ను మొత్తం ప్రభుత్వం కోసం వెచ్చించిన దానికి ఇచ్చే ప్రతిఫలమే పెన్షన్. మరి రిటైర్ అయిన తరువాత మీ చావు మీరు చావండి అంటే ఎలా?

27 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page