top of page

JVK app లో 2022_2023 విద్యా సంవత్సరానికి indent ను raise చేయడానికి సూచనలు.

Updated: May 13, 2022

JVK app లో 2022_2023 విద్యా సంవత్సరానికి indent ను raise చేయడానికి సూచనలు 2022_2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3 APP ను nadunedu.se.ap.gov.in/JVK అనే website నుండి Download చేసుకోవాలి. APP Download చేసుకున్న తరువాత login ID(IMMS app user ID) లను మీ మీ జిల్లాల DEO/APC లకు mail చేయడం జరిగింది.మీ జిల్లా CMO ద్వారా మీకు అందచేయబడ్డాయి. password ను 1234 తో login అవ్వాలి. మీరు క్రిత సంవత్సరం ఏదైనా పాస్వర్డ్ మార్చినట్లయితే అదే పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి enrollment ని 2 వ తరగతి గా promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది 2 వ తరగతి ని 3 వ తరగతి గా 3 వ తరగతి ని 4 వ తరగతి గా 4 వ తరగతి ని 5 వ తరగతి గా 5 వ తరగతి ని 6 వ తరగతి గా JVK3 app Promote చేయడం జరిగింది కాబట్టి ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాదిరిగా JVK app లో వచ్చే విద్యా సంవత్సరానికి indent raise చెయ్యాలి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా ఇదే మాదిరిగా indent raise చెయ్యాలి. ఆ పాఠశాలలో highest class 7 వ తరగతి గా ఉంటే 8 వ తరగతి వరకూ indent raise చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా promote చేశాము కాబట్టి) ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా jvk app లో చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా, 8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా 9 వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా jVK3 app లో promote చేయడం జరిగింది. అందరూ ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా jvk component వారీగా విద్యార్థుల సంఖ్యను enter చేసి submit చెయ్యాలి.





Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page