top of page

అమ్మఒడి తాజా మార్గదర్శకాలు సూచనలు...సబ్మిషన్లో పైనల్ టైం షెడ్యూల్.. ,Rc.242, Dt. 20/12/2019.

అమ్మఒడి తాజా మార్గదర్శకాలు సూచనలు... సబ్మిషన్లో పైనల్ టైం షెడ్యూల్.. ,Rc.242, Dt. 20/12/2019 పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు I.A.S ఆర్.సి. నెం. 242/ఎ & ఐ/2019, తేది : 20.12.2019 విషయం : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు. నిర్దేశములు : 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-II) వారి ఉత్తర్వులు నెం. 79, తేది : 4.11.2019 2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 16.11.2019 3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22.11.2019 4. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 2.12.2019 ఆదేశములు 'జగనన్న అమ్మఒడి' కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం చేసేందుకు పై సూచిక 2, 3 మరియు 4 లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి కార్యక్రమాలు ఈ క్రింది విధంగా చేయాల్సిందిగా కోరడమైనది. 1) 22.12.2019 - ప్రొఫార్మా-1 మరియు ప్రొఫార్మా -2లను పూర్తి చేయుట. 2) 24.12.2019 - ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారి ద్వారా పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియెట్ విద్య వారి సమాచారాన్ని సంయుక్తం చేసి అర్హులైన ఒకే తల్లి/ సంరక్షకులను గుర్తించుట. 3) 26.12.2019 మరియు 27.12.2019 - సదరు పూర్తయిన సమాచారాన్ని గ్రామసభ/వార్డు సభ ద్వారా అనుమతి పొందుట. 4) 29.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారులకు పంపించుట. 5) 30.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖాధికారులకు పంపుట. 6) 31.12.2019 - జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ వారి అనుమతి కొరకు పంపుట. 7) 01.01.2020 - జిల్లా కలెక్టర్ వారి అనుమతి పొందిన పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారి కార్యాలయానికి పంపుట. ఈ అంశంపై సమగ్రమైన ఆదేశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వారు మరియు పాఠశాల విద్యాశాఖా కమీషనరు వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు 20.12.2019న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా తెలియజేయడమైనది. Sd/ కమీషనర్, పాఠశాల విద్య (పూ. అ.బా)


Click here to download proceedings 👇


https://drive.google.com/file/d/1-LA4nRi-QkzJNnNWSEnCw20MOVO7t1h9/view?usp=drivesdk

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page