top of page

అమ్మఒడి పథకం వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు

Updated: Dec 8, 2019

అమ్మఒడి పథకం వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు

➤అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం.

➤అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 15 నుంచి 18 వరకు ముసాయిదా జాబితా.

➤గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం పొందాలి.

➤ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23లోగా మండల విద్యాశాఖాధికాకారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి.

➤ప్రొఫార్మా-1 పై తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం అవసరం లేదు.

➤రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2లో నమోదు చేయాలి.

➤ఆదార్ కార్డు లేకపోతే పొపార్మా-3లో నమోదు చేసి కమిషనరేట్ కు పంపించాలి.


ఫాం 2 వివరాలు నమోదు కు సంబంధించి సూచనలు :

• ముందుగా కుడి వైపు టాప్ కార్నర్ లో కుటుంబం తల్లిదండ్రుల యొక్క నివాస సమాచారం అనగా అడ్రస్ వ్రాయాలి.ప్రస్తుతం నివాస సమాచారం సమాచారం నమోదు చేయవలెను.

• ఆ తర్వాత హెచ్ మొబైల్ లోనే ఉంటుంది .దాని తర్వాత గ్యాప్ లో తల్లి లేదా తండ్రి మొబైల్ నెంబర్ కూడా నమోదు చేయవలెను.

• ఆ తర్వాత తల్లిదండ్రులకు సంబంధించి సమాచారం ఉంటుంది. దాంట్లో చైల్డ్ ఇన్ఫో లో తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి . కానీ అక్కడ తల్లి లేదా తండ్రి లేదా గార్డెన్ లలో ఎవరి రేషన్ కార్డ్ ఉండి ఆవివరాలు ఇస్తే వారి బ్యాంకు వివరాలు ఇస్తారు. వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పోస్ట్ చేయవలెను.

• బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందుపరచడం ఆధార్ నెంబరు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు పూర్తి చేయాలి.

• దీంతోపాటు గమనించవలసింది ఏమిటంటే ఫాం 2 లో ఎవరికైనా వైట్ రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డు నెంబర్ కూడా వేయాలి . తర్వాత వాళ్ళ సంతకం చేయవలసి ఉంటుంది.

• ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకపోయినట్లయితే . అలాంటి సందర్భంలో పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉదా అంగన్వాడి / టీచర్స్ / ఇతర వివరాలను నమోదు చేయాలి .

• ఎవరి జీతమైనా 2.5 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉన్న వారికి అమ్మవొడి వర్తిస్తుంది.

• జీతం డీటెయిల్స్ నమోదు చేయాలి . ఆ తర్వాత ఆ సమాచారం ఒప్పుకున్నారా అంటే agree అని లేకుంటే disagree అని నమోదు చేయాలి.

• ఒకవేళ వెహికల్ ఫోర్ వీలర్ ఉంటే ఆ ఫోర్ వీలర్ సంబంధించిన కింద సమాచారం పూర్తి చేయవలసి ఉంటుంది .

• అలాగే ల్యాండ్ సంబంధించి సమాచారం కూడా కావాలని అడిగి వివరాలు తీసుకుని పూర్తి చేయవలసి ఉంటుంది.

• అందుబాటులో తల్లిదండ్రులూ సమాచారం ఇస్తున్న సమాచారం తో నమోదు చేసి సంతకం చేయించాలి.

పరిశీలించాల్సినవి :

• ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారికి రేషన్ కార్డ్ (ఉంటే )--- నమోదు చేయాలి.

• ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారి ఆధార్ , బాంక్ అకౌంట్ వివరాలు. నమోదు చేయాలి.

• వైట్ రేషన్ కార్డు లేనివారికి ఫామ్ 2 లో మిగిలిన వివరాలు నమోదు చేయాలి.

సేకరించాల్సినవి :

• తల్లి/తండ్రుల/ గార్డియన్ మొబైల్ నంబర్లు.

• ప్రస్తుత అడ్రెస్.(వారు ఇచ్చేది ) అడ్రెస్ లో డోర్ నంబరు, లైన్, వారు నివశిస్తున్న పేట, వార్డ్ నంబరు.

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page