top of page

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా పథకము (APGLIS)

Updated: Aug 23, 2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా పథకము (APGLIS)

Andhra Pradesh Government Life Insurance Scheme


ప్రభుత్వోద్యోగులకు 01.11.1956 నుండి అమలులోనున్న ఈ పథకము జిఓ 212 ఆర్థిక, తేది. 17.12.1997 ద్వారా 01.01.1998 నుండి పంచాయితీ రాజ్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, జి.ఓ. 25 ఆర్థిక 03.03.2011 ద్వారా 1.03. 2011 నుండి మున్సిపల్ ఉపాధ్యాయులకు (విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ మినహా) వర్తింప జేయబడినది. 2015 పీఆర్సీ ప్రకారం జిఓ 36, తేది. 05.03.2016 ప్రకారం ప్రీమియం మొత్తాలు మార్పు చేయబడినవి. ఇవి 01.04.2016 నుండి అమలులోకి వస్తాయి. ప్రభుత్వ మెమో నం. 177/25/ఎ 2/అడ్మిషన్ 11/06, తేది. 07.02.2006 ప్రకారం పాలసీకు చెల్లించు మొత్తం 01.04.2006 నుండి సవరించబడింది. నిబంధనలు :  1)  20 సం,, లు, 55 సం,, ల మధ్య వయసు గలవారందరూ ఈ పథకములో సభ్యులు కావాలి.  2)  సర్వీస్ లో చేరిన మొదటి నెల నుండే ప్రీమియం మినహా యించాలి. (జిఓ నం. 199 ఆర్థిక, తేది. 30.07.2013). 3)  ప్రీమియం చెల్లించిన నెలలోనే దరఖాస్తును కూడపంపాలి. లేనిచో రిస్క్ కవరు కాదు.  4)  దరఖాస్తు ఫారంలో ఔను లేక కాదు అని స్పష్టంగావ్రాయాలి.  5)  55 సం,, లలోపు ప్రీమియం మినహాయించి నప్పటికీ, 55 సం,, లు దాటిన తర్వాత దరఖాస్తు పంపినచో అంగీకరించబడదు.  ప్రీమియం : నెలసరి మూలవేతనమును బట్టి ప్రీమియం చెల్లించాలి. పెరిగిన వేతనమును బట్టిప్రీమియంను కూడా పెంచాలి.  మూలవేతనములో 20%నకు మించకుండా ప్రీమియమును ముందుగానే ప్రీమియం పెంచుకొనవచ్చును. మొదటి ప్రీమియం తప్పనిసరిగా నిర్ణీత స్లాబ్ ప్రకారమే ఉండాలి. అన్ని పాలసీల మెచ్యురిటి విలువ 10 లక్షలు దాటిన సందర్భంలో మాత్రమే గుడ్ హెల్త్ సర్టిఫికెట్ జత చేయాలి. ఆదాయం పన్ను లెక్కింపులో ప్రీమియం మొత్తంపై పన్ను రిబేటు ఇవ్వబడుతుంది. సర్వీసులో ఉండగా శాశ్వత అంగవైకల్యం పొందితే 30/-ల వరకు ప్రిమియంలో మిన హాయింపు వర్తిస్తుంది.  బోనస్ : సాధారణ ఎల్ ఐ సి  కంటే ఈ పథకంలో చెల్లించే బోనస్ ఎక్కువ.  01.04.1996 నుండి 31.03.2002 వరకు 10%,   01.04.2002 నుండి 31.03.2005వరకు 11%, 01.04.2005  నుండి 10% బోనస్ చెల్లించబడుతుంది. అప్పు: ఈ పాలసీలో నిల్వవున్న మొత్తం (Paid up Value + Bonus)లో 90% అప్పుగా ఇస్తారు. నామినేషన్ : ఇతర పథకాలలో నామినేషన్ భార్యా పిల్లలకే ఇవ్వాలి. ఈ పథకములో కొంత శాతమును తల్లిదండ్రులకు, అక్కచెల్లెండ్రకు, అన్నదమ్ములకు కూడా కేటాయించవచ్చును. ఉద్యోగం మానుకుంటే : సూపరాన్యుయేషన్ పై రిటైరైనా, వాలంటరీగా లేక మెడికల్ ఇనవాలిడేషన్‌పై రిటైరైనా ఉద్యోగి కట్టిన డబ్బు + సర్వీసును బట్టి సరెండరు మొత్తము చెల్లిస్తారు. ఉద్యోగి కన్పించకుండా పోతే : ఒక సం||పాటు కన్పించకుండాపోతే అతని కుటుంబానికి పాలసీ మొత్తం + బోనస్ చెల్లిస్తారు.  ఉపయోగించుకోవాల్సిన ఫారాలు : నూతన ప్రతిపాదనకు ఫారం-1, తుది చెల్లింపు ఫారం-12 (రిఫండ్ ఫారం-1) ఋణదరఖాస్తు ఫారం-29, నామినేషన్ మార్పు ఫారం-3, మరణ క్లెయిమ్ ఫారం-రిఫండ్ ఫారం 2 గమనిక : నిర్ధారిత స్లాబ్ రేట్ల ప్రకారమే చందా మినహా యించినచో అదనపు బీమా ప్రతిపాదనలు సమర్పించనవసరం లేదు. డిడిఓలు ఉద్యోగికి సంబంధించిన వివరాలను పంపితే సరిపోతుంది. (జిఓ నం. 124 ఆర్థిక, తేది. 24.05.2013).  నూతన మరియు నిర్ధారిత స్లాబ్ రేటుకన్నా ఎక్కువ ప్రీమియం చెల్లిస్తూ వుంటే ప్రతిపాదనలు తప్పక పంపాలి.

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page