top of page
Writer's pictureAPTEACHERS

ఇంక్రిమెంట్లు-రకాలు


ఇంక్రిమెంట్లు-రకాలు:


ఒక సంవత్సర కాలము పాటు సంతృప్తికరంగా సేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని వార్షిక ఇంక్రిమెంట్లు అందురు.


ఒక ఉద్యోగిపై ఆరోపణలు చార్జిషిటు పెండింగ్ లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంటు నిలపరాదు.


APFC లోని ఫారం-49 లో డ్రాయింగ్ అధికారి ఇంక్రిమెంట్ ధృవపత్రంపై సంతకం చేసి వేతన బిల్లుకు జతపరచకపోతే ,ప్రభుత్వ ఉద్యోగికి ఇంక్రిమెంటు చెల్లించరు.

(G.O. Ms .No.212 Fin Dt:16-05-1961)


నెల మధ్యలో ఇంక్రిమెంట్ తేది ఉంటే అదే నెల మొదటి తేదికి మార్చబడుతుంది.

(G.O .Ms .No.133 Fin Dt:13-05-1974)

(G.O .Ms.No.546 Edn Dt:05-07-1974)


DSE ఉత్తర్వులు 3781/74 Dt:13-22-1974 ప్రకారం దండన క్రింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసులలో ఇంక్రిమెంట్లు దండన సమాప్తమైన తేది నుండి మంజూరు చేయబడతాయి/పునరుద్ద రించబడతాయి.


ఉద్యోగి సెలవులో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్లు మంజూరు చేయరాదు. డ్యూటీలో చేరిన తరువాతే మంజూరు చేయాలి.

(Memo. No.49463 Dt:06-10-1974)


ఉద్యోగి మొదటి వార్షిక  ఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాకుండానే మంజూరు చేయబడుతుంది.


Eg: ఒక ఉద్యోగ నియామక తేది 28-12-2012 సదరు ఉద్యోగి మొదటి ఇంక్రిమెంట్ 01-12-2013 న మంజూరు అవుతుంది.

నెల ఆఖరి రోజు సాయంత్రం నూతనంగా సర్వీసులో చేరినవారు తరువాత నెల మొదటి తేది నుండి జీతమునకు అర్హులు.జీతం తీసుకున్న నెలయే ఇంక్రిమెంట్ తేది అవుతుంది.

వార్షిక ఇంక్రిమెంట్ కు లెక్కించబడిన కాలమే అప్రయత్న పదోన్నతి పథకం(AAS) స్కేళ్ళ మంజూరుకు పరిగణించబడుతుంది.


ఇంక్రిమెంట్ కు పరిగణింపబడు కాలము


ఒక వేతన స్కేలు లో ఉద్యోగి చేసిన డ్యూటీ కాలం.

అన్ని రకాల సెలవులు (జీత నష్టపు సెలవు తప్ప)

డిప్యూటేషన్ పై పనిచేసిన కాలము.


అనుమతించబడిన మేరకు జాయినింగ్ కాలం.


పై పోస్టులో గడిపిన కాలం క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ కు పరిగణించబడుతుంది.


ప్రభుత్వ సెలవులు మరియు వెకేషన్ కాలం.


ఉద్యోగం చేస్తూ పొందిన శిక్షణా కాలం (డ్యూటీ గా పరిగణించబడి నప్పుడు మాత్రమే)


ఇంక్రిమెంటునకు పరిగణింపబడని కాలం


జీతనష్టపు సెలవు ఇంక్రిమెంట్ కు పరిగణించబడదు. సదరు సెలవు వాడుకున్న రోజులు ఇంక్రిమెంటు వాయిదా పడుతుంది.


జీతనష్టపు సెలవు వాడు కొన్నానూ ఇంక్రిమెంటు వాయిదా పడని సందర్భము:


వైద్య కారణాలపై,శాస్త్ర,సాంకేతిక ఉన్నత విద్యకై ఇంకా ఉద్యోగ పరిధిలో లేని కారణాలపై జీతనష్టపు సెలవు వాడుకొన్ననూ 6 నెలల వరకు సెలవు కాలాన్ని ఇంక్రిమెంటుకు లెక్కించు అధికారం ప్రభుత్వ శాఖాధిపతులకు ఇచ్చింది (ఉపాధ్యాయుల విషయంలో కమిషనర్ మరియు విద్యా సంచాలకుల వారు) (FR-26(2)) & G.O .Ms.No.43 F&P Dt:05-02-1976)


6 నెలల కంటే ఎక్కువ జీతనష్టపు సెలవు వాడుకున్న సందర్భాలలో ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలి.


ఇంక్రిమెంట్లు నిలుపుదల సందర్భాలు:


తప్పుడు ప్రవర్తనా , విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు 2 రకాలుగా నిలుపుదల చేయవచ్చును.


Without Cumulative Effect:


FR-24(1) ప్రకారం కేవలం ఒక సం॥ మాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేది నాడు విడుదలచేస్తారు. అంటే సదరు ఉద్యోగి ఒక సం॥ పాటు లేదా అంతకన్నా తక్కువ కాలం ఏరియర్స్ పోగొట్టుకుంటారు.


With Cumulative Effect:


దీన్ని అమలుచేసే ముందు విచారణాధికారిని నియమించాలి. సదరు ఉద్యోగి తన వాదనను వినిపించేoదుకు అవకాశం ఇవ్వాలి. ఉద్యోగికి చార్జిషిటు అందించడమే కాకుండా ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆరోపణ చేయబడినదో కూడా అందించాలి. ఈ శిక్ష ప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంటు కోల్పోతాడు.

4 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page