🌷ఇంక్రిమెంట్లకు సంబంధించిన విధివిధానాలు🌷 ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలోఅనేక ఇంక్రిమెంట్లు తీసుకుంటారు.
ఆ ఇంక్రిమెంట్లకు సంబంధించిన విధివిధానాలు, పూర్తి నిబంధనలను ఫైనాన్సియల్ కోడ్'లోస్పష్టంగా నిర్వచించారు. ఒక ఉద్యోగి సర్వీస్ కాలంలో తీసుకునే ఇంక్రిమెంట్ల నిబంధనలు ఇంక్రిమెంట్'నిబంధనలు ఇవీ.. వార్షిక ఇంక్రిమెంట్: ఒక సంవత్సరకాలం పాటుసంతృప్తికరంగాసేవలందించిన ఉద్యోగికి ఇచ్చే ప్రోత్సాహాకాన్ని వార్షిక ఇంక్రిమెంట్అంటారు.
ఒక ఉద్యోగిపై ఆరోపణలు, చార్జిషీట్లు పెండింగ్లో ఉంటే తప్ప ఆ ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్ను ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. నెలమధ్యలో వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉంటే అదే నెల మొదటి తేదీకి మార్చుతారు.
పనిషమెంట్ కింద ఇంక్రిమెంట్లను నిలిపివేసిన కేసుల్లో పనిషమెంట్ సమాప్తమైన తేదీ నుంచి మంజూరు చేస్తారు. ఉద్యోగి మొదటి వార్షికఇంక్రిమెంట్ 12 నెలలు పూర్తికాగానే మంజూరు చేస్తారు.
నెలలో ఆఖరి రోజు సాయంత్రం కొత్తగా సర్వీసులో చేరిన వారు తరువాతినెల మొదటి తేది నుంచి జీతానికి అర్హులు. జీతం తీసుకున్ననెల మొదటిరోజు ఇంక్రిమెంట్ తేది అవుతుంది.
ఇంక్రిమెంట్ కు పరిగణించే సమయం..
1. వేతన స్కేలులో ఉద్యోగి చేసిన డ్యూటీకాలం.
2.అన్ని రకాలసెలవులు (లాస్ ఆఫ్ పే తప్ప),
3. డిప్యుటేషన్ పై పనిచేసినకాలం. అనుమతించిన మేరకు జాయినింగ్ కాలం. లాస్ ఆఫ్ పే సెలవు కాలాన్ని ఇంక్రిమెంటకు పరిగణించరు. సదరు సెలవువాడుకున్నన్ని రోజులుఇంక్రిమెంట్ వాయిదాపడుతుంది.అయితేవైద్య కారణాలతో, శాస్త్ర సాంకేతిక ఉన్నత విద్యకోసం, ఇంకాఉద్యోగి పరిధిలో లేని కారణాలతో లాస్ ఆప్ పే వాడుకుంటే ఆరు నెలల వరకు అలాంటి సెలవు కాలాన్ని ఇంక్రిమెంట్పరిధిలోకి లెక్కించే అధికారం ప్రభుత్వ శాఖల అధికారులకుఉంది.
ఆరునెలల కంటే ఎక్కువ లాస్ ఆప్ పే సెలవును వాడుకున్న సందర్భాలలో ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవాలి.
ఇంక్రిమెంట్ కు వీటిని పరిగణించరు
1.తప్పుడుప్రవర్తన,విధినిర్వహణలో అలక్ష్యం ఉంటేక్రమశిక్షణ చర్యగా ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్ను నిలిపివేయవచ్చు.
2.విత్ అవుట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ప్రకారంకేవలం ఒక సంవత్సరంమాత్రమే నిలుపుదల చేసి తదుపరి ఇంక్రిమెంట్ తేదీకి విడుదల చేస్తారు.
3.విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ప్రకారంముందువిచారణఅధికారినినియమించాలి. సదరు ఉద్యోగితనవాదననువినిపించేందుకుఅవకాశం ఇవ్వాలి. ఉద్యోగికిఛార్జిషీట్అందించడమేకాకుండా, ఏ సాక్ష్యాధారాల ప్రకారం ఉద్యోగిపై ఆ ఆరోపణచేశారో దానిని కూడా అతనికి అందించాలి. ఈ శిక్షప్రకారం ఉద్యోగి శాశ్వతంగా ఇంక్రిమెంట్ కోల్పోతారు.