top of page

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి?? . 24 year scale అవగాహన!

Updated: Aug 23, 2021

ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి??


〰〰〰〰〰〰〰〰


☸EOT (141) & GOT (88&97)


➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.

➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం


☸ PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్)


➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.

➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం

➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.

➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.


☸ HM A/c టెస్ట్.


➤ ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.

➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.

➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.


☸ Spl Language Test (CODE--37)


➤ Who have not studied Telugu as 2nd Language in inter/degree, should pass Department Test for HM promotion.


☸ SOT (Simple Orientation Test)


➤ Only for Gr-I Pandits.



24 year scale గురించి తెలుసుకోండి.⬇️


✡️ముఖ్యంగా SGT లు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు.


✡️24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...


✡️ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది.


✡️మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు.


✡️ఎవరైనా SGT లు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.


మరో ముఖ్య విషయం.


✡️24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు.


✡️మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు.


ఒక ఉదాహరణ చూద్దాం.⬇️


✡️A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం.


✡️A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.


✡️మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి.


✡️A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు.


✡️B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం.


✡️B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు.


✡️మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు.


✡️కావున సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు.



Recent Posts

See All

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page