top of page
Writer's pictureAPTEACHERS

ఏపీ మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాలు.

Updated: Feb 4, 2020

ఏపీ మోడల్‌ స్కూళ్లల్లో ప్రవేశాలు

★ ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ.ఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఫిబ్రవరి 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

★ ఏపీ ఆన్‌లైన్‌, లేదా నెట్‌వర్క్‌ కేంద్రాలలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఎస్‌ఈ.ఏపీ.జీవోవి.ఐఎన్‌/ ఏపీఎంఎస్‌.ఏపీ.జీవోవి.ఐఎన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

★ నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పరీక్ష ఫీసు చెల్లిస్తే సాధారణ సంఖ్య వస్తుంది. ఈ సంఖ్య ఆధారంగా ఇంటర్‌నెట్‌ కేంద్రంలో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

★ అనంతరం దరఖాస్తు ప్రింట్‌ తీసుకుని మండల పరిధిలోని మోడల్‌ స్కూళ్ళలో సమర్పించాలి. దరఖాస్తుకు ఆధార్‌, కులం, ఆదాయం తదితర ధ్రువీకరణ పత్రాలను జతపర్చాలి.

★ ఏప్రిల్‌ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4, 5 తరగతులు చదివిన వారు అర్హులు.

ఓసీ, బీసీలు 01-09-2008 నుంచి 31-08-2010 మధ్య, ఎస్సీ, ఎస్టీలు 01-09-2006 నుంచి 31-08-2010 మధ్య జన్మించి ఉండాలి.

★ ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 ఫీజు (ఏపీ ఆన్‌లైన్‌, మీ-సేవా కేంద్రాల్లో) చెల్లించాలి. ఆదాయ పరిమితి నిబంధన లేదు. అల్పాదాయ వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తారు.

★ మండల పరిధిలోని మోడల్‌ స్కూళ్ళల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. 5వ తరగతి సామర్థ్యాలకి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్లంపై 25 మార్కుల చొప్పున ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఓసీ, బీసీ విద్యార్థులు కనీసం 35, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 30 మార్కులు తప్పక సాధించాలి.

Click here to download notification ⬇️


https://drive.google.com/file/d/1hOn5ml5CTCyZwX05vSbF_SwGNXFiZUED/view?usp=drivesdk


Click here to download Brochure ⬇️


https://drive.google.com/file/d/1h3E3BnmJGq0l55-19tFQ16mPxWIzbdvP/view?usp=drivesdk


28 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page