గుడ్లు,చిక్కీల పంపిణీకి పాటించవలసిన మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ.
- APTEACHERS
- Apr 24, 2021
- 1 min read
Updated: Aug 23, 2021
20.4.2021 నాటికి పాఠశాలల్లో మిగిలిపోయిన గుడ్లు,చిక్కీల పంపిణీకి పాటించవలసిన మార్గదర్శకాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ
మధ్యాహ్నాభోజన పధకం
అందరు మండల విద్యాశాఖాధికారులకు మరియు ఉప విద్యాశాఖాధికారులకు తెలియజేయునది ఏమనగా గౌరవ డైరెక్టర్ మధ్యాహ్నాభోజన పధకం మరియు స్కూల్ శానిటేషన్ వారి ఉత్తర్వులు ప్రాప్తికి 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు తేది 20.04.2021 నుండి వేసవి సెలవులు యిచ్చిఉన్నందున పాఠశాలలో చివరి రోజునాటికి మిగిలిఉన్న బియ్యం, గ్రుడ్లు మరియు చిక్కిలుపైన తగు సూచనలు జారీచేసియున్నారు.
1) పాఠశాలలో ఆఖరి రోజు (19.04.2021) నాటికి మిగిలుయున్న బియ్యం, గ్రుడ్లు మరియు చిక్కిలు Calculate చేసి స్టాకు Register లో నమోదు చేయవలయును.
2) ఉన్న స్టాకును విద్యార్ధుల రోల్ కు బాగించి విద్యార్ధులకు Distribution చేయవలయును ( with proper acknowledgement)
3) ఒక వేళ స్టాకు మరీ తక్కువగా ఉన్నట్టు అయితే Distribution అనేది Lower classes వాళ్ళకి మొదటి ప్రాధాన్యమిస్తూ Distribution చేయవలయును.
4) తే.20.04.2021 ది నాటికి స్టాకు వివరాలు మరియు Distribution చేసిన వివరాలు ఖచ్చితముగా రికార్డులలో భవిష్యత్ verification కొరకు నమోదు చేయవలయును.