top of page

జగన్నన్న అమ్మఒడి 2020-2021 మార్గదర్శకాలు

Updated: Aug 23, 2021

జగన్నన్న అమ్మఒడి 2020-2021 మార్గదర్శకాలు


9.12.2020 తేదీన గౌ౹౹ CSE వారి VC ఆదేశాలు

---------------------------------------------


జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు 9.01.2021 తేదీన రూ15,000/- అందాలంటే PS, UPS, HS Head Masters అందరు తప్పని సరిగా అందరి విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో లో ఉండునట్లు చూడవలెను.

🔷 5సంవత్సరాలకన్నా

( 31.08.2020)తక్కువ వయసు ఉన్న విద్యార్థులు జగనన్న అమ్మఒడి కి అర్హులు కాదు.


🔷విద్యార్థి ఆధార్ కార్డ్.

🔷తల్లి/గార్డియన్ ఆధార్ కార్డ్.

🔷 తెల్లరేషన్ కార్డ్.


🔷అమలు లో ఉన్న బ్యాంక్ ఖాతా నంబర్,IFC కోడ్ తప్పనిసరి .

🔷15.12.2020 రాత్రి 12.00 గంటలలోపు చైల్డ్ ఇన్ఫో అప్డేట్ చేయవలెను

🔷16.12.2020 వతేదీన సైట్ క్లోస్ అవుతుంది.అదే రోజు అర్హుల జాబితా విడుదల చేయబడును.

🔷కావున HM లు CRP ల సహకారంతో అన్ని పనులు పూర్తి బాధ్యతతో వెరిఫై చేయవలెను

🔷క్రిందటి సంవత్సరం అమ్మఒడి పథకం పొందని వారి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయవలెను.


మండల విద్యాశాఖాధికారులకు, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, సీఆర్పీలకు, ప్రత్యేక అధికారిణిలకు, ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్స్ మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక చాలా ముఖ్యమైన విషయం తెలియజేయుచున్నాను...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం జగనన్న అమ్మ ఒడి... ఈ పథకం ద్వారా మన జిల్లాలో సుమారు 3 లక్షల 92 వేల మంది ఏకైక తల్లుల బ్యాంకు ఖాతాలకు పదిహేనువేల రూపాయిల చొప్పున

9 జనవరి 2020 న ప్రభుత్వం నేరుగా జమచేసింది.

తిరిగి ఈ మహత్తర కార్యక్రమం 2021 సంవత్సరమునకు గాను

9 జనవరి 2021 న ఆంధ్రప్రదేశ్

గౌరవ ముఖ్యమంత్రివర్యులతో ప్రారంభిచబడుచున్నది...

ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారు ముందస్తుగా మనందరం పూర్తి చేయవలసిన కృత్యములు గురించి వివరించారు...

ఆ అంశములను మీకు తెలియజేయుచున్నాము...


✅ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న చైల్డ్ ఇన్ఫో డాటా ఆధారంగానే బాలబాలికల తల్లులు లేదా సంరక్షకులకు అమ్మ ఒడి ప్రోత్సాహకం అందుతుంది.

✅ ఈ సంవత్సరం కూడా

చైల్డ్ ఇన్ఫో డాటా తోనే ధృవీకరిస్తారు.

✅ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల అనగా 15-12-2020 సాయంత్రం 5 గంటలలోపు ఖచ్చితంగా అన్ని యాజమాన్య పాఠశాలలు చైల్డ్ ఇన్ఫో డాటా ను అప్డేట్ చేయడం మరియు న్యూ ఎడ్మిషన్స్ ఎంట్రీ చేయడం పూర్తి చేయాలి. 15-12-2020 సాయంత్రం 5 గంటల తరువాత చైల్డ్ ఇన్ఫో సైట్ ఆపివేస్తారు.

✅ ఈ సంవత్సరం కూడా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.అయితే తెల్ల రేషన్ కార్డు లేని వారికి రైస్ కార్డు నెంబరు అప్లోడ్ చేయుటకు అవకాశం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.

✅ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా విద్యార్ధినీ విద్యార్థుల పేర్లు.. వారి తల్లుల లేదా సంరక్షకుల పేర్లు అదేవిధంగా స్టూడెంట్ మరియు తల్లుల/సంరక్షకుల ఆధార్ నెంబర్లు మరియు తల్లుల/సంరక్షకుల బ్యాంకు అకౌంట్ నెంబర్లు మరియు ఐఎఫ్ ఎస్ సి కోడ్స్ సరిచూసుకోవాలి.

ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడుతుందని తెలియజేసారు.ఆధార్/రేషన్ కార్డు /బ్యాంకు అకౌంట్ నెంబర్లు తప్పైతే మార్చుకునే అవకాశం కల్పించబడుతుంది.

✅ ఈ సమాచారాన్ని శుద్ధి చేసి అర్హత గల మరియు అనర్హుల జాబితాలను 16-12-2020 న గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తారు. అనర్హతకు గల కారణాలను కూడా జాబితాలో తెలియజేస్తారు.

✅ జాబితాలు ప్రదర్శించిన నాటి నుంచి 20 డిశంబరు 2020 వరకు అభ్యంతరాలను తెలియపరుచుటకు అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు.

✅ తదుపరి 21-11-2020 న రెండో విడత గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తారు.

✅ తిరిగి మరోసారి అభ్యంతరాలను తెలియజేయుటకు

24-12-2020 వరకు సమయం ఇవ్వబడుతుందని తెలియజేసారు.

✅ 27-12-2020 న తుది జాబితా ప్రదర్శించబడును.

✅ 2019-20 విద్యా సంవత్సరంలో ఆరు అంచెల విధానంలో తెల్ల రేషన్ కార్డులు లేని వారిని అమ్మ ఒడి పథకానికి ఎంపికచేసి పదిహేనువేలు నగదు జమకాని పిల్లల తల్లుల జాబితాను ఈ సంవత్సరం అర్హుల జాబితాలో పొందుపరుస్తామని తెలియజేసారు.

✅ అనాధ బాలబాలికలందరికీ ఖచ్చితంగా వ్యక్తిగత అకౌంట్లు ఓపెన్ చేయించి సంసిద్ధంగా ఉండమని తెలియజేసారు.

✅ స్పందనలో అర్జీలు ఇచ్చిన వారి ఆర్జీలను మండల మరియు గ్రామ స్థాయిలో సంబంధిత అధికారులచే పరిశీలింపజేసి నిజమైన అర్హులను గుర్తించి వారిని అమ్మ ఒడి అర్హుల జాబితాలో చేర్చడానికి నిర్ణయం తీసుకునే అవకాశం జాయింట్ కలెక్టర్లకు కల్పించబోతున్నట్లు తెలియజేసారు.

✅ చైల్డ్ ఇన్ఫో లో పుట్టిన తేదీ ఆధారంగా అప్లోడ్ చేసి వున్న ఐదు సంవత్సరాల లోపు బాలబాలికలందరినీ నిబంధనల ప్రకారం అమ్మ ఒడి పథకానికి అనర్హులుగా ప్రకటించి సదరు వివరాలను అనర్హుల జాబితాలలో పొందుపరిచినట్లు తెలియజేసారు.

✅ రాష్ట్రంలో అత్యధికంగా ప్రైవేటు యాజమాన్య పాఠశాల్లో చైల్డ్ ఇన్ఫో ప్రక్రియ పూర్తి చేయవలసుందని తెలియజేసారు.

కావునా పై విషయాలను దృష్టిలో ఉంచుకుని మండల విద్యాశాఖాధికారులందరూ మీ మండలాల్లోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సదరు చైల్డ్ ఇన్ఫో ఎంట్రీ మరియు అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయించగలరు.

✅ ఖచ్చితంగా తల్లుల వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లు మాత్రమే ఎటువంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా నింపేలా తగు చర్యలు చేపట్టాలి.

✅ ఈ కార్యక్రమాన్ని దృష్టి లో ఉంచుకుని అన్ని యాజమాన్య పాఠశాలలు ఇప్పటి నుంచే పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వారి ఆధార్ కార్డు జెరాక్సు కాపీలను.. వైట్ రేషన్ కార్డు జెరాక్సు కాపీలను.. ఖాతా సంఖ్య మరియు ఐఎఫ్ఎస్ సికోడ్ లతో ఉన్న బ్యాంకు ఖాతా పుస్తకాల జెరాక్సు కాపీలను సేకరించి సమాచారం తో సంసిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేయుచున్నాము.

✅ ఈ ప్రక్రియ లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సంబంధిత ప్రధానోపాధ్యాయులు మరియు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

ఇట్లు,

జిల్లా విద్యాశాఖ అధికారి మరియ ఎక్స్ ఆఫిషియో జిల్లా ప్రాజక్టు కోఆర్డినేటర్ మరియు అదనపు పథక సంచాలకులు,

పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా,

విశాఖపట్నం.


Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page