top of page

జగనన్న అమ్మ ఒడి వారోత్సవాలు-మధ్యాహ్నభోజన పథకం

☆ నేటి షెడ్యూల్ :


👉 జగనన్న అమ్మ ఒడి వారోత్సవాలు-మధ్యాహ్నభోజన పథకం

☆ తేది : 06•01•2020 ☆ మధ్యాహ్నభోజన పథకం ☆ మధ్యాహ్నభోజన పథకం నాణ్యత పెంపు

☆ ఆహార పట్టీకలో సంక్రాంతి తర్వాత మార్పుల గురించి•••తల్లిదండ్రుల కమిటీసభ్యులకు,తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం


■జగనన్న అమ్మ ఒడి వారోత్సవాలు■ ●జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయులు జగనన్న అమ్మ ఒడి ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలి.

●ఈ రోజు 6-1-2020 కార్యక్రమం మధ్యాహ్నం భోజనం పథకంణ్యత పెంపు - తల్లిదండ్రుల సామూహిక భోజనాలు ●ఈరోజు తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు మరియు తల్లిదండ్రులకు మధ్యాహ్నం భోజన పథకం నాణ్యత పెంపు మరియు పట్టికలో సంక్రాంతి తర్వాత మార్పుల గురించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు అందరికీ సామూహిక భోజనాలు ఏర్పాటు చేయాలి. ●పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో చేపట్టిన మార్పులను వారికి వివరించి మధ్యాహ్న భోజనం పాఠశాలలోని చేసేటట్లు ప్రోత్సహించాలి ●తల్లిదండ్రులు మరియు తల్లిదండ్రుల కాబట్టి ఈ సమయంలో పాఠశాలను సందర్శించి భోజనం నాణ్యతను పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇవ్వాలి. ●భోజనం నాణ్యత పెంచడం కోసం రోజువారీ భోజనంలో తగు మార్పులు చేయడం కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సూచనలు చేయడం జరిగింది ●నూతన ఆహార పట్టికను మరియు అదనపు పౌష్టికాహారాన్ని సంక్రాంతి తర్వాత పాఠశాలలో అమలు చేయటం జరుగుతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నది. ●ఈ రోజు కార్యక్రమమునకు మధ్యాహ్న భోజన పథకం వివరాలను ఫ్లెక్సీ రూపంలో మరియు కరపత్రం లో తల్లిదండ్రులకు ఇవ్వ వలెను. ఈ కార్యక్రమమునకు ప్రజాప్రతినిధులను గ్రామ పెద్దలు ఆహ్వానించాలని తెలియజేయడం జరిగింది -

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page