top of page

జగనన్న విద్యా కానుక- యూనిఫాం క్లాత్ కొరకు పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి మార్గదర్శకాలు– జారీ.

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Aug 23, 2021

జగనన్న విద్యా కానుక- యూనిఫాం క్లాత్ కొరకు పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి మార్గదర్శకాలు– జారీ.


పాఠశాల విద్యాశాఖ - జగనన్న విద్యా కానుక- యూనిఫాం క్లాత్ మరింత ఖచ్చితంగా సరఫరా చేయడానికి వీలుగా పిల్లల ఎత్తు నమోదు చేయుట గురించి - జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు– జారీ.


🍁 1-5 తరగతుల విద్యార్థుల ఎత్తు కొలతల నమోదు- మార్గదర్శకాలు::


❖ ఒకటి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థుల కొలతలు తీసుకోవడానికి పిల్లలను ఒకరోజు పాఠశాలలకు పిలిచి ఆయా క్లాస్‌ టీచర్లకు ఆ పనిని కేటాయించాలి.


❖ ప్రస్తుత కోవిడ్‌

నిబంధనలను అనుసరించి ఈ పనిని పూర్తి చేయాలి.


⊹ సూచనలు:


↦ మొదటిగా ఒక గోడపై సెంటీమీటర్లలో ఎత్తు తెలిసేలా 190 సెంటీమీటర్ల వరకు నోట్‌ చేసిపెట్టుకోవాలి


↦ఎత్తు తీసుకునేటపుడు వారు నిటారుగా ఉండేలా చూడాలి.


↦పిల్లల ఎత్తు సెంటీమీటర్లలో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి.


↦ ఒక తరగతి పిల్లలందరి ఎత్తు వివరాలు ఒక పేపర్‌ పైన ముందు రాసి పెట్టుకుంటే లింక్‌ లో నమోదుకి సంబంధించినచేయడం సులభం అవుతుంది.


↦ వ్యాయామ ఉపాధ్యాయులు, సిఆర్పీ ల సహాయంతో ఎత్తు కొలవడం, నమోదు చేయడం పూర్తి చేయాలి.


↦ పిల్లల ఎత్తు వివరాలను సెంటీమీటర్లలో ప్రధానోపాధ్యాయుని లాగిన్‌ లో ఇచ్చిన లింక్‌ లో...



https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES


ఖచ్చితంగా నమోదు చేయాలి.


విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు విధానం::


⊹ కింది క్రమాన్ని పాటించవలెను.


❖కింది లింక్ ద్వారా చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడి ,పాస్వర్డ్ ను ఉపయోగించి.. ప్రధానోపాధ్యాయులు లాగిన్ కావలెను.

➠ https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES


❖తదనంతరం.. SERVICE ను ఎంచుకొని..UPDATE STUDENT HEIGHT DETAIL Form ను CLICK చేయాలి.


❖తదుపరి వచ్చు UPDATE STUDENT HEIGHT Details Form ( Box) నందు విద్యార్థి ఐ.డీ నెంబర్ నమోదు చేయాలి.


❖తరువాత ..

↦SCHOOL CODE.

↦STUDENT ID.

↦STUDING CLASS.

↦STUDENT NAME.

↦GENDER.

↦STUDENT AADHAAR NO.

↦MOTHER/GUARDIAN NAME.

↦ SELECT STUDENT HEIGHT..


❖మొదలగు వివరాలతో కూడిన FORM ఓపెన్ అవుతుంది.


❖ఈ వివరాల చివర ఉన్న.. SELECT STUDENT HEIGHT.. ఆప్షన్ను తాకితే 50 నుండి 185 సెంటీమీటర్ల వరకు కొలతలు అగుపిస్తాయి.


❖ఇందులో విద్యార్థి యొక్క సరైన కొలతను ఎంచుకొని .. SUBMIT DATA పై CLICK చేయవలెను.


❖ దీనితో ఒక విద్యార్థి యొక్క ఎత్తు కొలత విజయవంతంగా నమోదవుతుంది.


❖ ఈ విధానాన్ని ప్రతి విద్యార్థికి అనుసరిస్తూ పోవాలి.



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page