4% reservation in appointment and in promotions to Persons with Disabilities GO.MS.No.2 Dt:19-02-2020
దివ్యాంగులకు నియామకాలు, పదోన్నతులలో ఇక 4% రిజర్వేషన్.
GO.MS.No.2 Dt:19-02-2020 - Department for Women, Children, Differently Abled and Senior Citizens - Providing four percent (4%) reservation in appointment and in promotions in every Government establishment in favour of benchmark disabilities as per the section 34 of the Rights of Persons with Disabilities Act, 2016 - Comprehensive Orders - Issued.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమలవుతున్న 3% రిజర్వేషన్లను 4%కి పెంచింది. నియామకాలకు సంబంధించి అంధత్వం, కంటిచూపు మందగించిన వారికి 1%, వినికిడి లోపం ఉన్నవారికి 1%, చలన సంబంధ వైకల్యం, కండరాల బలహీనత, మస్తిష్క పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, మరగుజ్జుతనం, యాసిడ్ దాడి బాధితులకు 1% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆటిజం, లెర్నింగ్ డిసెబిలిటీతో బాధపడేవారికి 1% రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఐదుగురికి మించి సిబ్బంది ఉన్న ఏ శాఖలో అయినా పదోన్నతుల్లోనూ ఇవే రిజర్వేషన్లు వర్తింపచేస్తారు.