top of page
Writer's pictureAPTEACHERS

పి.ఓలు మరియు ఏ పీ.వోల విధులు-లోకల్ బాడీస్- 2020.

Updated: Aug 23, 2021

MPTC/ZPTC ఎన్నికలు-2020

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద సరిచూసుకొనవలసిన మెటీరియల్

>బ్యాలెట్ పెట్టె;పెట్టె పై నంబరు;వర్కింగ్ కండిషన్ సరిచూసుకోవాలి.

>బ్యాలెట్ పేపర్లు (MPTC,ZPTC విడివిడిగా) లెక్కపెట్టుకోవాలి. మధ్యలో Missing ఏమైనాఉంటే గుర్తించాలి.

>ఏరో క్రాస్ మార్క్స్

>స్టాంప్ పాడ్స్

>ఇండిలబుల్ ఇంక్

>మార్క్ డ్ కాపి-ఎలక్టోరల్ రోల్ + 3 ఇతర వర్కింగ్ కాపీలు.

>పోలింగ్ స్టేషన్ నంబర్-రబ్బర్ స్టాంపు

>బ్యాలెట్లు చించడానికి ఐరన్ స్కేలు

>పేపర్ సీల్స్;నంబర్లు సరిచూసుకోవాలి.

>స్పెషల్ tags

>మెటల్ సీల్

>పోలింగ్ ఏజెంట్ఐడికార్డ్స్

>పోలింగ్ సిబ్బంది ఐడికార్డ్స్

>గుడ్డసంచి మరియు గోనెసంచి

>సూది,దారం

>సీలింగ్ వేక్స్ ,అగ్గిపెట్టె

>కొవ్వొత్తులు

>పుషర్

>బయటి పోస్టర్స్

అతి ముఖ్యమైన ఫారంలు:

1.Ballot paper account (Anx-20/Pg.No.121) 6కాపీలకు తక్కువ కాకుండా ఉంటే మంచిది. 2.ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ (Anxr-19/Pg.No.118) 3.పేపర్ సీల్ అక్కౌంట్ (Anxr-8/Pg No.104) 4.PO డిక్లరేషన్ (Anxr-10,Pg.No.106) 5.విజిట్ రిపోర్టు (Anxr-23/Pg.125)

పోలింగ్ స్టేషన్ చేరిన తర్వాత చేయవలసినవి

>కుర్చీలు,బెంచీలు, బల్లలు పోలింగ్ కు అనుకూలంగా సర్దుకోవాలి. >ఓటింగ్ కపార్ట్ మెంట్ కట్టుకోవాలి.ఒకటి చాలు.ఓటర్ల సంఖ్య ఎక్కువనిపిస్తే రెండు ఏర్పాటు చేసుకోవాలి. >సిబ్బందికి ఐడికార్డ్స్ ఇచ్చి విధులు కేటాయించుకోవాలి. >బ్యాలట్ వెనుక వైపున పైన క్రింద పోలింగ్ స్టేషన్ నెంబరు స్టాంపు వేసుకోవాలి. >బ్యాలట్ వెనుకవైపున PO sign చేసుకోవాలి. >Male/Femaleఓటింగ్ చూపించే నంబర్లు తెల్లకాగితంపై వేసుకునిఉంచుకోవడం/print పట్టుకుని వెళ్ళడం మంచిది. >పూర్తి చేయాల్సిన ఫారంలు, కవర్లపై పోలింగ్ స్టేషన్ నంబర్లు, పేర్లు వ్రాసుకోవడం >సీల్డ్ చేయవలసిన కవర్లకు మూడు ప్రక్కల సీల్ వేసుకోవడం. >పోలింగ్ స్టేషన్ ఏరియా తెలిపే మరియు అభ్యర్థుల వివరాలు తెలిపే పోస్టర్లను బయట గోడకు అంటించండం >పోలింగ్ ఏజెంట్లకు కబురుపంపడం >ఏజంట్లు వచ్చిన తరువాత ఏజంట్ ఫారంలు తీసుకుని వాటికి కేటాయించిన కవర్ లో ఉంచి వారి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న పిదప వారికి ఐడికార్డులు ఇవ్వడం. (Appointmnt of polling agents Anx-22,Pg.124) >ఉదయంఆరు గంటలకి ఖచ్చితంగా హాజరు కావలసిందిగా సూచించడం

పోల్ డే. (21-3-2020)

>బ్యాలెట్ పెట్టె సీలింగ్:

ఏజంట్లు వచ్చిన తరువాత పెట్టెలోపలి భాగం చూపి లోపల ఏమీ లేవని వారి చేత చెప్పించాలి.

>బాక్స్ లోపల అడ్రస్ స్లిప్ (PO సంతకం;ఏజంట్ల సంతకాలు పెట్టి) వేయాలి.

>పేపర్ సీల్ తీసుకుని తెల్లగా ఉన్నవైపు PO సంతకం పెట్టి ఏజంట్ల సంతకాలు పెట్టించాలి.

>బ్యాలట్ పెట్టె కున్న whole పూర్తిగా కవర్ అయ్యేలా పెపర్ సీల్ ను జాగ్రత్తగా మడచుకుని అమర్చాలి.జరగకుండా చిన్నఅట్టముక్కను అమర్చాలి.

>పెట్టె పై భాగంనకు green రంగు కనపడుతూ ఉండాలి.దాని పై పోలింగ్ స్టేషన్ నంబరు సూచించే Round stamp వేయాలి.

>పెట్టెను మూసి semi lock చేయాలి.పూర్తిగా మూయరాదు.Ballot papers వేసే సన్నటి ద్వారం కనపడుతూ ఉండాలి.

>పూర్తిగా మూసివేస్తే ముందు వేసిన paper seal చించి పెట్టెను మరలా తెరవాల్సి ఉంటుంది.

>Semi lock చేసిన తరువాత తాత్కాలిక seal వేయాలి.పోలింగ్ ముగిసిన తరువాత ఈ సీల్ తీసి పెట్టెను మొత్తం మూసి మరలా శాశ్వత సీల్ వేస్తామని చెప్పాలి.

>బాక్సు కు అడ్రస్

Slipకట్టి PO,ఏజెంట్లు సంతకాలు చేయాలి

>వాడిన paper seal నంబరు నమోదు చేసుకోవాలి.

>డిక్లరేషన్ లో ఏజెంట్లు సంతకం before commencement of poll వద్ద తీసుకోవాలి.

>PO డైరీలో పేపర్ సీల్,అడ్రస్ టాగ్ నెంబర్లు (ఉంటే) నమోదు చేసుకోవాలి.

Ready to start poll

APO-marked copy

OPO-1:ఇంఢిలబుల్ ఇంక్

OPO-2: MPTC బ్యాలట్

OPO-3: ZPTC బ్యాలట్

7am ఓటర్లను ఓటింగ్ హాల్లోకిఅనుమతించండి

>ఓటరు గుర్తింపు ను EPIC లేదా 20 రకాల కార్డుల ద్వారా check చేసిన మీదట ఓటరు స్లిప్ ఆధారంగా ఓటును ఇవ్వాలి.

>ఓటర్ Male అయితే మార్కుడ్ కాపీలో ఓటర్ ఫోటోమరియు పేరు దగ్గర diagonal గా Red ink తో క్రాస్ మరియు ఓటర్ Female ఐతే Diaginal గా Red ink తో క్రాస్ మరియు నంబర్ వద్ద రెడ్ ఇంక్ తో రౌండప్ చేయాలి.

>ఎడమచేతి చూపుడు వేలుకు ఇండిలబుల్ ink తో గుర్తు గోరుమధ్యనుండి వేలు కణుపు వరకు పెట్టాలి.

>బ్యాలట్ కౌంటర్ ఫాయిల్ మీద ఓటర్ సీరియల్ నంబర్ మరియు గుర్తింపు నంబర్ వ్రాసి ఓటరు సంతకం/వేలిముద్ర తీసుకోవాలి.

>ZPTC,MPTC ఓట్లు సమానంగా ఇస్తున్నారో లేదో check చేసుకుంటూ ఉండమనాలి.

>ఓటింగ్ సమయంలో ప్రతీ ఓటరూ విధిగా రెండు ఓట్లు వేస్తున్నాడో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి.

ఛాలెంజ్ ఓటు

ఓటర్ నిజం కాదని ఏజెంట్ చాలెంజ్ చేస్తే, చాలెంజ్ ఫీజు తీసుకొని , బి ఎల్ ఓ, తో నిజానిజాలు తెలుసుకుని నిజమైన ఓటరును ఓటుకు అనుమతించవచ్చు. లేదా పోలీసులకు అప్పగించాలి. వివరాలుఫారంలోనింపాలి.


ఓటరు వచ్చి తన గుర్తింపు విషయంలో ఎవరికైనా అనుమానం తలెత్తినప్పుడు తను లేదు అది నేనె అని ఛాలెంజ్ చేసి ఓటు వేసేటప్పుడు అనేక ప్రశ్నల ద్వారా హెచ్చరించి సాధ్యమైనంతవరకు వాటికి అవకాశం ఇవ్వకుండా కాదు కూడదు అన్నప్పుడు తనకు ఛాలెంజ్ ఓటుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఛాలెంజ్ ఫీని ఫార్మ్ నంబర్ 21 లో 5 రూపాలు కట్టించుకొని నమోదు చేసి ఇవ్వాలి 1.Chalenge Fee Receipt:Anx-12/ Pg.111 2.Complaint to Police:Anx-13/Pg.112 3.Chalenge voters List:Anx-24/Pg.126

బ్లైండ్ ఓటర్స్


ఓటరు తను పూర్తిగా ఓటువేయలేని స్థితి లో ఉన్నప్పుడు వారిని 18 ఏళ్ల పైబడి ఉన్న సహచర ఓటరును తన ఓటును వేయడానికి అనుమతించవచ్చు అలాంటి వారి వివరాలను ఫార్మ్ నంబర్ 23 లో నమోదు చేయాలి

>ఎవరైనా కళ్ళు కనబడని వారు, వయో వృద్ధులు వస్తే వారికి తోడుగా కంపెనీయన్ ను తెచ్చుకున్నట్లే తే కంపేనియన్ ఓటర్ వివరాలు ఫారం లలోనింపండి. ఇలాంటి కంపేనియన్ ను ఒకరిని ఒకసారి మాత్రమే అనుమతించవచ్చు. 1.Declaration:Anx-16/Pg.115 2.List:Anxr-25/Pg.127

టెండర్ ఓటు

ఒక వ్యక్తి ఓటు వేయడానికి వెళ్లిన సందర్భంలో అప్పటికే అతని ఓటు వేసినట్లుగా నమోదయిన సందర్భంలో సదరు వచ్చిన వ్యక్తి ఓటు వేస్తానని రుజువు చూపి పట్టుబడితే, అతనికి మళ్ళీ ఒక ఓటు ఇచ్చి న సందర్భాన్ని టెండర్ ఓటు అంటాము.. అలాంటపుడు అతనిని సరిగా విచారించి ,పరిశీలించి అతను కచ్చితంగా వేయలేదని నిర్ధారించుకొన్న తరువాత

ఓటరు వివరాలను ఫార్మ్ నంబర్ 24లో నమోదు చేసి దానిలో అతనిసంతకం చేయించుకొని మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ బండల్ లోని చివరి నుండి ఉన్న మొదటిది తీసుకుని దాని వెనుక వైపు కౌంటర్ ఫైల్ మరియు బ్యాలెట్ పేపర్ రెండిటి మీద పీఓ టెండెర్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసి అతనికి ఇచ్చి అతను ఓటు వేసిన తరువాత దానిని ఓటింగ్ కంపార్టుమెంట్ లో వేయకుండా పీవో దగ్గరే ఉంచుకొని వేరుగా అలాంటి ఓటును ఇవ్వబడిన saparate కవర్ లో ఉంచి సీల్ చెయ్యాలి.

వివరాలను ఫార్మ్ నంబర్ 25లో నింపాలి

కాన్సిల్ అండ్ స్పాయిల్ బ్యాలెట్ పేపర్ కూడా జాగ్రత్తగా వెనక్కి ఇవ్వాలి.( ఫార్మ్25 లో నమోదు చేసి )

.ఇలాంటి టెండర్ ఓట్లు మొత్తం ఆ బూత్ ఓటర్లలో 2 శాతానికి మించితే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలి. 1.List of tender votes: Anxr-28/Pg.130

>ఎవరైనా ఓటర్ 18సంవత్సరాలు కు తక్కువ ఉన్నట్టు గా మీరు అనుమాన పడితే ఓటర్ డిక్లరేషన్ సంతకంచేయించి ఓటుకు అనుమతించండి. (Anx-14/Pg.113) >ఓటింగ్ జరుగుతున్నంతసేపు ప్రతి గంటకుఓటింగ్ శాతాన్ని మేల్ ఫిమేల్ వారిగా పై అధికారులకు తెలుపుటకు సిద్ధంగా ఉండండి >పోలింగ్ ఏజెంట్ లను చివరి గంటలో బయటికి వెళ్లకుండా చూడండి. >5 గంటలకు ఎంతమంది అయితే వరుసలో నిలబడ్డారో వారికి సంతకంఛేేసిన స్లిప్పులు చివరినుండి ఇవ్వండి తర్వాత వచ్చిన ఓటర్లను అనుమతించకండి

ఓటింగ్ ముగిసిన తరువాత

>డెక్లరేషన్ పై ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్లుగా ఏజెంట్ల చె సంతకం చేయించండి.

>తరువాత బ్యాలట్ పేపర్ అకౌంట్ లో అన్ని వివరాలు నింపి ప్రతి ఏజెంటు కు ఒకటి ఇవ్వండి, మీ దగ్గర మూడు కాపీలు ఉండేటట్టుగా చూసుకోండి.

>పోలింగ్ ఏజెంట్లు సమక్షంలోనే

బాక్సునకు అడ్రస్ టాగ్ కట్టి లక్క సీల్ వేయండి.

అన్ని ఫారాలను పూర్తి ఛేపీ కవర్ల లో పెట్టండి.సీలు వేయవలసినవి వేయండి.

బ్యాలట్ పేపర్ అకౌంట్ PO డైరీ మాత్రం అంటించకపోవడం మంచిది.

Covers

> స్టాట్యుటరీ (BROWN) Pg. 92 > స్టాట్యూటరీ (GREEN) Pg. 92 >నాన్ స్టాట్యూటరీ(YELLOW) Pg.92 >Other ( BLUE) Pg.93 >డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద వచ్చిన పోలింగ్ ఆఫీసర్లు సహకారంతో మెటీరియల్ అప్పగించండి.


సీలింగ్ ఆఫ్ ఎలక్షన్ పేపర్స్

ఇందులో 5 రకాల 5 రంగుల ప్యాకేట్స్ ఉంటాయి మొదటిది బ్రౌన్ రంగు ఇందులో 1.బ్యాలెట్ పేపర్ అకౌంట్ 2.పీవో ప్రకటించబడిన పత్రము 3.పేపర్ సీల్ అకౌంట్ 4.పీవో డైరీ 5.విజిట్ షీట్ ఇవి చాలా ముఖ్యమనవి వీటితో పాటు బ్యాలెట్ బాక్స్ ను కలిపి ఒక కౌంటర్ లో సబ్మిట్ చేయాలి రెండవ రంగు ప్యాకెట్ గ్రీన్ కలర్ స్టాచుటరీ కవర్స్ ఇందులో 1.మార్కేడ్ కాపీ ఆఫ్ ఏలొ క్ట్రోల్ రోల్(సీల్ చేయబడిన) 2.సంతకం చేసి వాడకుండా ఉంచిన బ్యాలెట్ పేపర్స్ (సీల్ చేయబడిన) 3.సంతకం చేయకుండా మిగిలిపోయిన బ్యాలెట్ పేపర్స్ 4.సీల్ చేయబడిన టెండెర్డ్ బ్యాలెట్ పేపర్స్ 5.క్యాన్సల్డ్ బ్యాలెట్ పేపర్స్ 6. బ్యాలెట్ పేపర్స్ కౌంటర్ ఫైల్స్ 3వ రంగు ఎల్లో కవర్స్ ఇవి స్టాచుటరీ కవర్స్ ఇందులో 1.1.మార్క్ చేయని ఏలోక్ట్రోరోల్ కాపీలు 2.పోలింగ్ ఏజెంట్ల నియామక లెటర్స్ 3.edc సర్టిఫికెట్ 4.లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ ఓట్లు 5.అంధుల ఓట్లు వివరాలు 6.వయస్సు నిర్ధారణ పత్రాలు 7.రసీదు పత్రాలు 8.చిరిగిపోయిన వాడని పేపర్ సీల్ ఇక 4 వది బ్లూ ఇందులో 1.పీవో హాండ్ బుక్ 2.ఇండెలిబుల్ ఇంక్ 3.ఇంక్ ప్యాడ్స్ 4.మెటల్ సీల్ 5.ధిష్టింగిషేడ్ మార్క్ 6. యారో క్రాస్ మార్క్ సీల్ ఇంక 5 వది వైట్ ఇందులో2 మిగిలిన అన్ని వేసి కౌంటర్ లో అప్పగించాలి

Identificatin cards:

EPIC card 1.Aadhar card 2.Passport 3.Driving Licence 4.PAN Card 5.Employee ID card with photo 6.Pension Documents with photo 7.Pattadar Passbook 8.Bank Passbook with photo 9.ATM Card with photo 10.Ration card with photo 11.NPR Smart card 12.MGNREGS Job card 13.SC/ST/BC certificate with photo 14.Freedom fighter identity cards 15.Arms license with photo 16.Physically handicapped certificate with photo 17.Bar council Membership card with photo 18.Health Insurance smart card with photo 19.Identity card issues by Secretariat 20.Lok sabha/Rajya Sabha members identity card.

41 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page