top of page
Writer's pictureAPTEACHERS

పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో మధ్యాహ్నభోజన కార్మికులు ఇవి ధరించకూడదు : కేంద్ర విద్యాశాఖ షరతులు

Updated: Aug 23, 2021




పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ షరతులు..


మధ్యాహ్నభోజన కార్మికులు ఇవి ధరించకూడదు : కేంద్ర విద్యాశాఖ షరతులు


సూచనలు


◙ mid-day meal workers: పిల్లలు మధ్యాహ్న భోజన సమయంలో గుంపులుగా ఉండకుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.


◙ అలాగే భోజనాన్ని శుభ్రమైన ప్రదేశాల్లో చేయాలని, వంట చేసే వారు రింగులు, గాజులు ధరించకూడదని వెల్లడించింది.


◙ గోళ్ల రంగు కూడా వేసుకోకూడదని పేర్కొంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు గైడ్‌లైన్స్‌ని తయారుచేసుకోవచ్చునని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ నిషాంక్ తెలిపారు.


► మార్గదర్శకాలివే:


◙ మధ్యాహ్న భోజనం తయారుచేసే వారిలో ఎవరికీ పాజిటివ్‌ లేకుండా జిల్లా స్థాయి అధికారులు చూసుకోవాలి.


◙ పాఠశాలలు ప్రారంభం అవ్వకముందే వంట మనుషులు, వారికి సహాయం చేసే వారి ఆరోగ్యం, అలాగే వారి ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ధ్రువీకరణ తీసుకోవాలి.


◙ పాఠశాలలో ప్రవేశించేముందు వారికి థర్మల్ పరీక్షలు చేయాలి.


◙ మధ్యాహ్న భోజన కార్మికులు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.


◙ నెయిల్ పాలిస్‌(గోళ్ల రంగు) లేదా ఆర్టిఫిషియల్ గోళ్లు ధరించకూడదు.


◙ వంట చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు మధ్యాహ్న భోజన కార్మికులు చేతి గడియారం, రింగులు, గాజులు, బంగారంను ధరించకూడదు.


◙ ఉమ్మివేయం, ముక్కును తడుముకోవడం నిషేధం.


◙ మధ్యాహ్న భోజన కార్మికులు శుభ్రమైన ఆప్రాన్లను ధరించాలి.


◙ కూరగాయలను ఉప్పు-పసుపు లేదా 50 పీపీఎమ్‌ క్లోరిన్‌తో కడగాలి.


◙ అన్నం వడ్డించే సమయంలో భౌతిక దూరం పాటించేలా బ్యాచ్‌లుగా విద్యార్థులను విభజించాలి. అలా కుదరకపోతే వారి వారి క్లాస్ రూమ్‌లలో భోజనం వడ్డించాలి.


◙ సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో మార్కింగ్‌ ఉండాలి.


◙ భోజనం 65డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. అన్నం వండిన వెంటనే వడ్డించకూడదు.

10 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page