top of page

పాఠశాలలలో పేరెంట్స్ కమిటీ 2021 ఏర్పాటు మార్గదర్శకాలు విడుదల.File No.SSA-16021/1/2019-MIS SEC-SSA.

Updated: Sep 20, 2021


1. ఎన్నికల ప్రక్రియ HM నిర్వహించాలి .

2. కనీసం 50 % Parents PC Election ఎంపిక ప్రక్రియకు హాజరు కావలెను .

3. ఎన్నికల ప్రక్రియ సాధారణంగా చేతులు ఎత్తడం / నోటితో చెప్పడం ద్వారా జరపాలి.అసాధారణ పరిస్థితులలో మాత్రమే Secret Ballot ఉపయోగించాలి .

4. Mother / Father / Guardian లో ఎవరో ఒక్కరు మాత్రమే ఎన్నికలలో పాల్గొనే దానికి అర్హులు .

5. తల్లి తండ్రులకు వేర్వేరు తరగతులలో విద్యార్థులు ఉంటే వారు ఆయా తరగతుల PC . ఎన్నికలలో పాల్గొనవచ్చు .

6. PC సభ్యులుగా ఎంపిక కాబడిన వారు , వారి Chairmen & vice chairmen ను ఎంపిక చేయాలి . Chairmen & Vice chairman est ść Disadvantage group కు చెందినవారు.మరొకరు మహిళ అయి ఉండాలి .

7. Local Bodies కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కానీ , అపాఠశాల HM కానీ , Asst teacher కానీ . PC ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హులు .

8. Weaker Section , BC , Minorities మరియు యు OC Parents వార్షిక ఆదాయం RS 60 000 లోపు ఉండాలి .

9. ఎన్నికల ప్రక్రియకు ఎవరయినా విఘాతం కలిగించినచో వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకోన బడుతాయి . There should not be any political interference .

10. MRO , MPDO , VRO , VRA లు ఎన్నికల Observers . గా రావచ్చును .

11. Disadvantages & weaker section నుంచి సభ్యులు దొరకనపుడు It can be filled as per existing Rules of Reservation .

12. PC ఎన్నికలలో పాల్గొనే voters వారి ID Cards ( . Aadhar card / Ration card ) తప్పక తీసుకు రావాలి .

పాఠశాలలలో పేరెంట్స్ కమిటీ 2021 ఏర్పాటు మార్గదర్శకాలు విడుదల.

🌼Parents committee ఎన్నికలు

🎯ఈ నెల 16న నోటిఫికేషన్

✳️22న ఎన్నిక, అదే రోజు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం

🥀ఎన్నికల మార్గదర్శకాలు ఇవే..

ప్రతి పాఠశాలలో ఎన్నికలను హెచ్ఎంలు

నిర్వహిస్తారు. 50 శాతం తల్లిదండ్రులు లేదా

సంరక్షకులు ఉండాలి. కోరం రూపొందించే

సమయంను ప్రధానోపాధ్యాయుడు నిర్ణయిస్తారు.

చేతులు ఎత్తే పద్దతి లేదా నోటితో చెప్పే పద్ధతి ద్వారా ఎన్నిక ఉంటుంది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రహస్య ఓటింగ్ నిర్వహించాలి.

- వివిధ తరగతుల్లో పిల్లలున్న తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులు.

- ఎన్నికైన పేరెంట్స్ కమిటీ సభ్యుల నుంచి

చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలి. వీరిలో

కనీసం ఒకరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారితో పాటు ఒకరు మహిళ అయి ఉండాలి.

- స్థానిక సంస్థల్లో ఉన్న సభ్యులు, హెచ్ఎంలు ఓటింగ్ లో పాల్గొనేందుకు అనర్హులు.

ఓటు హక్కు కలిగిన పేరెంట్/ గార్డియన్లు

కొత్తగా అవసరమైన తల్లిదండ్రుల కమిటీ

సభ్యులను ఎన్నుకుంటారు. ఖాళీ అయిన సభ్యుల స్థానంలో కూడా కొత్త వారిని ఎన్నుకోవచ్చు.

ఒకసారి ఎన్నికైన పేరెంట్స్ కమిటీని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాశాలల్లో యంఈవో,

ఇతర పాఠశాలల్లో డీఈవోల ఆదేశాల

ప్రకారం రద్దు లేదా ఇతర పాఠశాలల్లో విలీనం అయ్యేంతవరకు కొనసాగుతాయి.

ఒక కిలోమీటరు దూరంలో గల ప్రాథమిక

పాఠశాల, 3 కిలోమీటర్ల దూరంలో గల ఆవాస ప్రాంతాలను నైబర్ హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్ గా పేర్కొంటారు.

ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండరాదు. ఎన్నికలకు ఇబ్బందులు కలిగిస్తే అట్టి

వారు చట్టరీత్యా శిక్షార్హులు.

పరిశీలకులుగా తహసీల్దారు/ ఎంపీడీఓ,

విలేజ్ కార్యదర్శి లేదా వీఆర్ఓలు ఎన్నికల

కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.


ఓటింగ్ లో పాల్గొనాలంటే ఓటింగ్ కోసం జారీచేసిన ఓటింగ్ గుర్తింపు కార్డు, రేషన్

కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్

కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఇతర ఏదైనా

గుర్తింపు కార్డు తప్పనిసరి.

- డిజడ్వాంటేజెస్, వీకర్స్ సభ్యులు లేని పక్షంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సభ్యులను ఎన్నుకోవాలి.

🎯పేరెంట్స్ కమిటీ నిర్మాణం

ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి. వారిలో ఇద్దరు మహిళలు.

ముగ్గురిలో ఒకరు ఎస్.సి/ ఎస్.టి, మరొకరు బి.సి అయి ఉండాలి.

ఎన్నికైన సభ్యుల కాలపరిమితి 2 సంవత్సరాలు లేదా ఆ సభ్యుల యొక్క

పిల్లలు ఆ పాఠశాలలో ఉన్నంతవరకు ఇందులో ఏది ముందు అయితే అది, వారి కాలపరిమితిగా పరిగణిస్తారు.

🎯ఎక్స్ అఫీషియో మెంబర్లు:

ప్రధానోపాధ్యాయుడు/ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు

(మెంబర్ కన్వీనర్), ఎంఈవోచే నామినేట్

చేసిన అదనపు ఉపాధ్యాయ సభ్యులు

(ప్రధానోపాధ్యాయుని జెండర్‌కు వ్యతిరేక

సభ్యులు అయి ఉండాలి), ఆ ప్రాంత కార్పొరేటర్/ కౌన్సిలర్ వార్డు సభ్యుల యందు

ఒకరు, అంగన్‌వాడీ వర్కర్లు, నైబర్ హుడ్ ఏరియాల్లో పనిచేసేవారు, మల్టీపర్పస్ హెల్త్

వర్కర్, గ్రామంలోని /వార్డులోని మహిళా

సమైక్య ప్రెసిడెంట్.

🎯కోఆప్షన్ మెంబర్లు:

విద్యావేత్తలు, పెలాంత్రపిస్టులు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలకు చేయూత నందించే వారి నుంచి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

వీరి పదవీకాలం మొదటి మీటింగ్ నుంచి రెండు సంవత్సరాలపాటు కొనసాగుతుంది.

🎯లోకల్ అథారిటీ చైర్ పర్సన్స్:

ఆయా ప్రాంతంలోని సర్పంచ్/ మున్సిపల్ చైర్ పర్సన్/మేయలు ఆయా ప్రాంతాల్లో జరిగే పి.సి మీటింగ్ లకు వారి విచక్షణ మేరకు హాజరవుతారు.

🎯ఉదయం 9 నుంచి 1 గంట వరకు..

ఈనెల 16న అన్ని పాఠశాలల్లో పాఠశాల ప్రధనోపాధ్యాయుడు ఉదయం 10 గంటలకు

ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. .

మధ్యాహ్నం 2 గంటల్లోపు ఓటర్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రకటిస్తారు.

20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించుట, పరిశీలించుట,

మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల్లోపు

ఓటర్ల తుది జాబితాను పాఠశాల నోటీసు

బోర్డులో ప్రకటిస్తారు.

22 ఉదయం 7 గంటల

నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఎన్నిక నిర్వహించి తల్లిదండ్రుల కమిటీ సభ్యులు జాబితా ప్రకటించాలి.

మధ్యాహ్నం 1.30 గంటలకు తల్లిదండ్రుల కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక పూర్తి చేయాలి.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 8.30 గంటల మధ్య తల్లిదండ్రుల కమిటీతో ప్రమాణ స్వీకారం పూర్తి చేసి సమావేశాన్ని నిర్వహించాలి.



File No.SSA-16021/1/2019-MIS SEC-SSA.

AP Parents Committee PC Formation Guidelines 2021 - PCs in AP Primary, UP High Schools 2021. 🌹పేరెంట్స్ కమిటీల ఎన్నిక-2021🌹 ఎన్నికలలో పాటించవలసిన నియమాలు: ▪️పేరెంట్స్ కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలు పూర్తి అయిన వాటికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయవలెను. ▪️గతంలో పేరెంట్స్ కమిటీ కి అసలు ఎన్నికలు జరగని వాటికి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయవలెను. ▪️ప్రతి తరగతికి కోరం50% ఉండాలి ▪️సాధారణంగా ఎన్నిక చేతులు ఎత్తడం ద్వారా గానీ నోటితో చెప్పడం ద్వారా గానీ జరగాలి. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిని అనుసరించాలి. ▪️పేరెంట్స్ / గార్డెన్లలో ఒక్కరికి మాత్రమే ఓటు ఓటు వేసే హక్కు ఉంది,వారి పిల్లలు వేర్వేరు క్లాసులో చదువుతుంటే ఆ ఆ క్లాసులో ఓటేసే హక్కు ఆ పేరెంట్స్కు ఉంది. ▪️ఎన్నిక కాబడిన పేరెంట్స్ కమిటీ మెంబర్స్ నుండి ఒకరిని చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవాలి ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. కనీసం ఒకరు డిసడ్డ్వాంటేజ్ గ్రూప్ లేదా వీకర్ సెక్షన్ కు చెందిన వారై ఉండాలి. ▪️నైబర్హుడ్ ఏరియా స్కూల్ అనగా ప్రైమరీ స్కూల్ అయితే కిలోమీటర్ల లోపు హైస్కూలు / యు పి స్కూల్ అయితే మూడు కిలోమీటర్ల లోపు ఉండాలి. ▪️డిసడ్వాంటేజెస్ గ్రూప్ అనగా ఎస్సీ, ఎస్టీ, అనాధ పిల్లలు, Migrants, స్ట్రీట్ చిల్డ్రన్ అండ్ హెచ్ ఐ వి బాధిత చిల్డ్రన్. ▪️వీకర్ సెక్షన్ అనగా బిసి,మైనారిటీ అండ్ ఓసి పిల్లలు ఇన్కమ్ పరిధి లో ఉన్నటువంటి వారు (వైట్ కార్డ్ హోల్డర్ ). ▪️ఎమ్మార్వో, ఎంపీడీవో, విఆర్వో, విలేజ్ సెక్రటరీ, వీఆర్ఏలు ఎన్నికల ప్రక్రియలో అబ్జర్వర్ గా ఉంటారు. ▪️ఓటింగ్ Order of priority ఈ విధంగా ఉంటుంది మదర్,ఫాదర్ వీరిద్దరూ లేకపోతే గార్డియన్. ▪️ప్రతి ఓటరు ఈ దిగువ తెలిపిన ఏదో ఒక ఐడి కార్డు తప్పనిసరిగా తేవాలి. రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి ఇంకేదైనా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఐడీ కార్డు. ▪️డిసడ్వాంటేజెస్ /వీకర్ సెక్షన్ కు చెందిన పిల్లల తల్లిదండ్రులు ఎలక్షన్లకు హాజరు కాలేక పోతే రిజర్వేషన్ ప్రకారం వాటిని ఫిల్ చేయాలి. కమిటీ నిర్మాణం ఎన్నిక కాబడిన సభ్యులు

వీరిలో ఒకరు డిసడ్డ్వాంటేజ్ గ్రూపుకు చెందిన వారు,మరొకరు వీకర్ సెక్షన్ కు చెందిన వారు అయి ఉండాలి . అంతే కాకుండా కనీసం ఇద్దరు స్త్రీలు అయి ఉండాలి .ఈ విధంగా ప్రతి క్లాసుకు ముగ్గురు ఉండాలి ఆ పాఠశాలల్లో ఎన్ని తరగతులు ఉంటే అన్ని తరగతుల సంఖ్యకు మూడు రెట్ల సభ్యులు ఉండాలి. ఒక తరగతిలో పిల్లల సంఖ్య ఆరు కన్నా తక్కువగా ఉంటే ఆ పై తరగతి తో గానీ ముందు తరగతి తో గాని కలిపి ఎలక్షన్ నిర్వహించాలి .ఎన్నిక కాబడిన వ్యక్తి యొక్క పదవీకాలం రెండు సంవత్సరాలు లేదా పిల్లలు స్కూలు వదిలి వెళ్లే వరకు ఈ రెండిటిలో ఏది ముందు అయితే అంత వరకు ఉంటుంది . ఆ పాఠశాల యందు పెద్ద తరగతి పిల్లలు వెళ్ళిపోతే ఎంట్రీ క్లాస్ పిల్లల తల్లిదండ్రులను ఎన్నుకోవాలి.

ఎక్స్ అఫీషియో మెంబర్లు:

హెచ్ఎం గానీ ఇన్చార్జి HM గాని కన్వీనర్గా ఉంటారు. హెచ్ ఎం / ఇన్చార్జి HMకు వ్యతిరేక జండర్ కలిగిన ఒక టీచర్ను MEO నామినేట్ చేస్తారు. ఆ ప్రాంతానికి చెందిన కార్పోరేటర్ గానీ కౌన్సిలర్ గానీ వార్డ్ మెంబర్ గానీ ఉంటారు. నైబర్హుడ్ ప్రాంతానికి చెందిన అంగన్వాడీ వర్కర్ ఉంటారు . ఆ ప్రాంతానికి చెందిన ANM ఉంటారు. ఆ గ్రామం లేక వార్డు కు చెందిన మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ ఉంటారు.

కో ఆప్టెడ్ మెంబెర్స్ :

ఇద్దరు స్కూల్ కి సపోర్ట్ చేసే బాగా చదువుకున్న వ్యక్తులు గాని ఇతరులకు సహాయం చేసే వ్యక్తులు గాని ఉంటారు. లోకల్ అథారిటీ చైర్పర్సన్ ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్ కానీ మున్సిపల్ చైర్ పర్సన్ హాజరు కావచ్చు. ▪️చుట్టు పక్క రాష్ట్రాల పిల్లల తల్లిదండ్రులు ఎలక్షన్లలో పాల్గొనవచ్చు . పేరెంట్స్ కమిటీ ఎన్నిక మరియు మీటింగు డేటామొత్తాన్ని అప్లోడ్ చేయాలి ▪️covid 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఎలక్షన్ ప్రక్రియ లో చేయకూడని పనులు ▪️ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ లో ఎలక్షన్స్ జరగకూడదు. ▪️స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించేవారు,స్కూల్ HM/ I/C HM ఎన్నికలలో పాల్గొనకూడదు.వారికి ఓటు హక్కు లేదు. ▪️ఎన్నికలలో రాజకీయ జోక్యం ఉండకూడదు. ▪️ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన పిల్లల తల్లిదండ్రులు ఎలక్షన్లో పాల్గొనకూడదు. ▪️గార్డెన్ను చైర్పర్సన్గా నిర్మించకూడదు. ▪️పేరెంట్స్,గార్డియన్ తప్ప మిగిలిన వారెవరూ స్కూలు ఆవరణలో ప్రవేశించకూడదు. ఈ నెల 22న జరిగే పాఠశాల తలిదండ్రుల కమిటీ ఎన్నికలు 2021 నిర్వహించడానికి SSA వారు ఇచ్చిన తాజా క్లారిఫికేషన్స్.మెమో తేదీ : 19.9.21⬇️




تعليقات


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page