top of page

భారత రాజ్యాంగ నిర్మాత "అంబేద్కర్"

🌹భారత రాజ్యాంగ నిర్మాత "అంబేద్కర్" గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు గుర్తుచేసుకుంటూ..🌹 👉భీంరావ్ రాంజీ అంబేడ్కర్ గారు ఏప్రిల్ 14, 1891న జన్మించారు. భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, డిసెంబర్ 6, 1956న మరణించారు. 🍁అంబేద్కర్ గారి ముఖ్య వ్యాఖ్యలు🍁 👉నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు.. 👉మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం 👉గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి. 👉కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా. 👉నా దేశ సమస్యలకూ, నా జాతి సమస్యలకూ మధ్య సంఘర్షణ వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యం ఇస్తాను.నేనూ,నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది. 👉పుస్తకాలు దీపాలవంటివి. వాటిలోని వెలుతురు మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. 👉మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడచిన కాలమూ తిరిగిరాదు. 👉ప్రతి స్త్రీని,ప్రతి పురుషుని శాస్త్ర దాస్యం నుంచి విముక్తుల్ని చేయండి. 👉మేకల్ని బలి ఇస్తారు కానీ పులుల్ని బలి ఇవ్వరు. 👉కౄరత్వం కంటే నీచత్వమే హీనమైనది. 👉కులం పునాదుల మీద మీరు దేనిని సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. 👉దేశానికి గానీ,జాతికి గానీ సంఖ్యాబలమొక్కటే చాలదు.వారు ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో,ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. 👉కళ్లు అంటే విజ్ఞానపు వాకిళ్లు. వాటిని బద్దకంతో నిద్రకు అంకితం చేస్తే భవిష్యత్ తలుపులు తెరుచుకోకపోగా అంతా అంధకారమే మిగులుతుంది. అలాకాక సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముందుకు దూసుకుపోతే అంతు తెలియని జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే ఇంకా ఇంకా శోధించాలనే తపనలకు మూలం అవుతుంది. అదే అనంత శిఖరాల అంచులపై మనల్ని నిలిపేలా చేస్తుంది. ఆ శక్తి కేవలం విద్యకే వుంది.

12 views

תגובות


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page