🍲మార్చ్1 నుండి మధ్యాహ్న భోజనం మెను మార్పు చేస్తూ ఉత్తర్వులు 🍲 ప్రతి శుక్రవారం హాట్ పొంగల్, సాంబారు, గుడ్లు.
తయారు చేసే విధానం:
10.03.2022 న ప్రభుత్వం విడుదల చేసిన సూచనల ప్రకారం పొంగల్ తయారీ.. పొంగల్ తయారు చేయు విధానం. [మాదిరి] కొద్ది మొత్తం తోటి. కావలసిన పదార్ధాలు. 1]. బియ్యం 200 గ్రాములు [ఒక కప్] 2]. పెసరపప్పు 100 గ్రాములు [1/2 కప్] ౩]. నీళ్ళు 5 కప్పులు. 4]. నల్ల మిరియాలు రెండు టీ స్పూన్లు లేదా 5 గ్రాములు 5]. జీల కర్ర ౩/4 టీ స్పూన్ లేదా 5 గ్రాములు 6]. కరివేపాకులు మూడు రెమ్మలు 7]. ఇంగువ – చిటికెడు 8]. అల్లం తురుము 1 టీ స్పూన్ 9]. నెయ్యి -2 టీ స్పూన్ లు విధానం.: 1]. పెసరపప్పును పొడిగా అనగా ఎటువంటి నూనె లేకుండా కొంచెం సువాసన వచ్చే వరకు బాణలి లో వేయించాలి. 2]. బియ్యాన్ని కడగాలి. కడిగిన బియ్యాన్ని ఒక అరగంట సేపు నాన బెట్టాలి. ౩]. ఎక్కువ మందమైన అడుగు కల బాణలి ని స్టవ్ మీద వేడి చేయాలి. 4]. నూనె, జీలకర్ర, మిరియాల పొడి, ఇంగువ, అల్లం తురుము, కరివేపాకు అన్ని వేసి దోరగా వేయించాలి. 5]. వేయించిన పెసరపప్పు, నాన బెట్టిన బియ్యం బాణలి లో వేయాలి. బాగా కలపాలి. 6]. ఐదు కప్పుల నీటిని పోసి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడక నివ్వాలి. బియ్యం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. 7]. తరువాత బాగా కలిపి, దించి , వేడిగా వడ్డించాలి. Attention to DEOs and ADs, pl note the order issued for supply of Pongal in Friday menu instead of white rice and issue instructions to the field functionaries for implementation from 1st March without fail.