రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ డైరెక్టర్ జి. విశ్వనాథప్ప సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా విద్యాశాఖాధికారులు, అదనపు ప్రాజెక్ట్
కో ఆర్డినేటర్లు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 14 వరకు కేలండర్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఏప్రిల్ 14 న డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో స్కూల్ లెవల్, డివిజినల్ లెవల్, జిల్లా లెవల్ లో ఈవెంట్లు
నిర్వహించాలని సూచించారు.ఎస్సే రైటింగ్, మాక్ పార్లమెంట్ సెషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, సెమినార్, డిబేట్ తదితర కార్యక్రమాలను ఈ
నెల 26 నుంచి ప్రారంభించాలని సూచించారు. వీటిపై ఉన్నతాధికారుల నేతృత్వంలో జనవరిలో జిల్లా,రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలని తెలిపారు.
వీటికి సంబంధించిన అంశాలను తరగతుల వారీగా సూచిస్తున్నట్లు విశ్వనాథప్ప పేర్కొన్నారు.
పూర్తి వివరాల కొరకు తెలుగులో
Click here to download👇
https://drive.google.com/file/d/1Vjb9kUiamkj9Y0qrQUN35qVUizcRZ4ZK/view?usp=drivesdk