top of page
Writer's pictureAPTEACHERS

పిల్లల అభ్యసనాభివృద్ధి పెంపుదల కార్యక్రమము (వంద రోజుల ప్రణాళిక) (LEAD program) విశాఖపట్నం జిల్లా


పిల్లల అభ్యసనాభివృద్ధి పెంపుదల కార్యక్రమము (వంద రోజుల ప్రణాళిక)

( LEARNING ENHANCEMENT AND DEVELOPMENT PROGRAM ) పాఠశాల విద్యలో ప్రాథమిక, ప్రాధమికోన్నత మరియు ఉన్నత స్థాయిలోనున్న విద్యార్ధుల అభ్యసనాభివృద్ధి మరియు సామర్ధ్యాల పెంపుదల అనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యము. కరోనా విలయ తాండవం వల్ల గత రెండు విద్యా సంవత్సరాలలో పిల్లలకు ఆశించినంత మేర అభ్యసనావకాశాలను కల్పించలేకపోయాము. ఆధునిక సాంకేతికత సహకారముతో పాఠ్యాంశాలు అందించినప్పటికీ ఆశించినంత మేర అభ్యసన జరుగలేదన్నది మొన్నటి F.A-1 పరీక్షల ఫలితాల ద్వారా స్పష్టమైంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే కాని, పిల్లలను మరలా అభ్యసనం వైపు తీసుకురావడం అన్నది కష్టం అని అర్ధం అవుతోంది. విద్యా సంవత్సరములో మిగిలి ఉన్న 12౦ రోజులను పూర్తిగా వినియోగించుకొని రాబోయే విద్యా సంవత్సరం నాటికైనా పిల్లలను వారి వారి తరగతులకు సిద్ధం చేసుకోవాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. 1) 1,2 తరగతులు; 3,4, 5 తరగతులు ; 6 – 9 తరగతులు ఈ విధంగా 3 విభాగాలుగా పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో కనీస అభ్యసన సామర్ధ్యాలు సాధించుట. 2) 10 వ తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించుట. 3) పిల్లలలో తెలుగు, ఆంగ్లము, గణితం (ఉన్నత పాఠశాలలో హిందీ కూడా) లలో కనీస అభ్యసన స్థాయిలను సాధించుట.

లక్ష్యములు :

1,2 తరగతులకు :

1) తెలుగులో వర్ణమాల, సరళపదాలు చదువగల్గుట, వ్రాయగల్గుట. 2) గణితంలో 99 వరకు అంకెలు చదువగల్గుట, వ్రాయగల్గుట. ఒక అంకె, రెండు అంకెల కూడికలు, ఒక అంకె తీసివేత 3) ఆంగ్లములో Alphabets , చిన్నచిన్న వాడుక పదాలు వ్రాయడం, చదవడం. 4) వీరికి ఎటువంటి ప్రారంభ పరీక్ష నిర్వహించనవసరం లేదు

3, 4, 5 తరగతులు :

1) తెలుగులో వర్ణమాల, గుణింతాలు, సంయుక్త పదాలు, ద్విత్వాక్షరాలుతో కూడిన పదాలు చదువ గల్గుట, వ్రాయగల్గుట, వాక్యములు చదువగల్గుట, సరళ వాక్యములు వ్రాయ గల్గుట . 2) గణితంలో కూడిక, తీసివేత, గుణకారము, భాగహారము చేయగల్గుట; సంకలన, వ్యవకలన, గుణకారములలో సరళమైన వ్రాత లెక్కలు చేయగల్గుట. 3) ఆంగ్లం లో CAPITAL LETTERS, SMALL LETTERS గుర్తింపు, గుణి0తాలు, చిన్నచిన్న పదాలు చదవ గలగడం, వ్రాయగలగడం . 4) 5 వ తరగతి కి హిందీవర్ణమాల , గుణింతం పరిచయం. 6,7,8,9 తరగతులు :

1) తెలుగులో వర్ణమాల, గుణింతాలు, సరళ పదాలు, సంయుక్త పదాలు, ద్విత్వాక్షరాలు, వాక్యాలు, రాయడం, చదువగల్గడం ; వ్యాకరణం . 2) గణితంలో చతుర్విధ ప్రక్రియలు, దశాంశ మానము, శాతములు, జ్యామితీయ ఆకారాల పరిచయం, నమూనాల చిత్రణ 3) హిందీలో వర్ణమాల పరిచయం, సరళపదాలు వ్రాయగలగడం, చదవడం. 4) ఆంగ్లం లో పదాలు సరియైన PRONUNCIATION చేయగలగడం, వ్రాయగలగడం, DICTIONARY ఉపయోగించ గలగడం, వాక్యాలు వ్రాయగలగడం, LEGIBLE HANDWRITING కలిగి ఉండటం. 10వ తరగతి :

పాఠ్యాంశాలను జనవరి 15 నాటికి పూర్తిచేయడానికి ప్రణాళికతో పాటు రివిజన్ మరియు విద్యార్థులపై ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ వహించుట ద్వారా 1౦౦% ఉత్తీర్ణత సాధన. అదే సమయములో పాఠశాలలో సరిపడా విద్యా స్థాయి ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ మరియు అత్యధిక 10/10 లు సాధించుట. పదవతరగతి పిల్లలకు ప్రతిరోజూ సాయంత్రం 4.00 నుండి 5.00 గం వరకు ప్రత్యేక బోదననిర్వహించవలసి ఉంటుంది. ఉదయం ప్రత్యేక తరగతులు ఐచ్చికం. పర్యవేక్షణ :

ఉపాధ్యాయులకు సహాయకులు మరియు మార్గదర్శకులుగా ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో ఐదంచెల వ్యవస్థ ఏర్పాటు. 1) C.R.Ps 2) School HM/ Complex HM or HIGH SCHOOL HM 3) Nodal HM / MEO 4) DIET Team / Sectoral Officers of Samagra Shikshaa. 5) Constituency level HMs 6) DCEB / AMO/ AAMO/ CMO / MIS Co-Ord 7) Dy.Eos / A.Ds / APC, SSA / DEO/DEO Agency దీనిలో పాఠశాల స్థాయి ప్రదానోపాధ్యాయులకు ప్రతీ వారం కూడా Staff review కోసం ప్రత్యేకమైన చెక్ లిస్టు ఏర్పాటు, మిగిలిన వారికి వారి వారి స్థాయిల ప్రకారం visit proforma ఏర్పాటు. లక్ష్యసాధన :

ఇది స్తబ్దంగా ఉండిపోయిన మన విద్యార్థుల విద్యా స్థాయిని పెంపొందించడం కోసం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చేపడుతున్న కార్యక్రమం. కావున మనం స్వచ్చందంగా ముందుకు రావాల్సిన కార్యక్రమము. ముందుగా పిల్లలను గ్రేడ్ల వారీ గా విభజించుకోవాలి. దీనికి గాను, Testing Tools మీకు అందజేయబడతాయి. వాటి ప్రకారం ప్రతీ విద్యార్ధి ఏ గ్రూపులో , ఏ స్థాయి లో ఉన్నారు అనేది వర్గీకరించు కోవాలి . SSA/ DCEB వారు అందిస్తున్న“ సవరణాత్మక కార్యక్రమం” ద్వారా పిల్లలను క్రమ పద్ధతిలో వారి స్థాయి పెంపుదలకు కృషి చేయాలి. బాధ్యతలు : 1) ప్రతీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలతో పాటు తన Catchment Area లో నున్న ఒక పాఠశాలను దత్తత తీసుకోవాలి. 2) ప్రధానోపాధ్యాయుడు తన ఉపాధ్యాయులతో కలిసి చర్చిస్తూ పిల్లల విద్యాభివృద్ధిలో సరియైన మార్గదర్శకత్వం చూపాలి . 3) నోడల్ హెచ్.ఎం, మండల విద్యాశాఖాధికారి వారితో ఇతర ఉన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ మండల స్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలి. 4) మండల స్థాయి లో విద్యార్థుల ప్రగతి ని సమీక్షిస్తూ ఉపాధ్యాయులకు సూచనలు అందించడానికి జిల్లాఉపాధ్యాయ శిక్షణా సంస్థ నుంచి ఒకరు నియమింప బడతారు. 5) నియోజక వర్గ స్థాయి లో ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రగతి ని సమీక్షిస్తూ ఉపాధ్యాయులకు సూచనలు అందించడానికి ఆ నియోజక వర్గం లోని ఒక అనుభవజ్ఞుడైన ప్రధానోపాధ్యాయులు ఒకరు నియమింప బడతారు. 6) జిల్లా స్థాయి లో ఈ కార్యక్రమం అమలుకు అవసరమైన బోధనాభ్యసన సామాగ్రి, మానిటరింగ్ ప్రోఫార్మ లు DCEB / AMO / AAMO ద్వారా అందచేయబడతాయి. కార్యక్రమ వ్యవధి :

ఈ కార్యక్రమం తే 17.11.2021ది నుండి తే 30.04.2022 ది వరకు ( మొత్తం 120 పని దినములు ) అమలు చేయబడుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికీ పిల్లలందరూ ఆయా స్థాయికి చేరుకోవలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం. కార్యక్రమ అమలు : క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమ అమలులో ప్రధాన భూమిక ఉపాధ్యాయులది మరియు ప్రధానోపాధ్యాయులది. అందుకే వారికి ఈ కార్యక్రమ అమలులో పూర్తి స్థాయిలో అందరు అధికారుల సహకారం అందచేయబడుతుంది. పాఠశాల లోని ప్రతీ ఉపాధ్యాయుడు తెలుగు, హిందీ, ఆంగ్లం మరియు గణితం లలో ఏదో ఒక సబ్జెక్టు ను ఎంచుకోవలసి ఉంటుంది. మొత్తం పాఠశాల లో (పదవ తరగతి మినహా) అన్ని తరగతులకు ఈ నాలుగు సబ్జెక్టులను బోధించవలసి ఉంటుంది కావున అందరు ఉపాధ్యాయులు ఈ నాలుగింటిలో ఏదో ఒకటి ఎంచుకోవలసి ఉంటుంది. ముందుగా పిల్లల ప్రస్తుత విద్యా సామర్ధ్యాల పరిస్థితి ని పరీక్షించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను TESTING TOOLS (తెలుగు, ఆంగ్లం,గణితము , ఉన్నత పాఠశాల లకు హిందీ కూడా) అందచేయబడతాయి. అందరు విద్యార్ధులను వారి వారి సామర్ధ్యాలను గుర్తించి, తరగతి గ్రేడు ను నిర్ధారించుకోవాలి. ఇచ్చిన ప్రోఫోర్మ నందు నమోదు చేయాలి. విద్యార్ధుల సామర్ధ్యాల వారీగా వ్యక్తిగత బోధన చేయవలసి వుంటుంది. విద్యార్ధుల స్థాయి కి అనుగుణంగా ఎలా, ఏయే అంశాలు ఎలా బోధించాలనేది వివిధ మాధ్యమాల ద్వారా అందించబడతాయి. REPORTS : పాఠశాల ప్రధానోపాధ్యాయుడు 15 రోజుల కొకసారి పిల్లల వ్యక్తిగత అభివృద్ధిని తనకు tag చేయబడిన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా మండల విద్యాశాఖాధికారునికి అందచేయాలి. వారు నియోజకవర్గ ప్రధానోపాధ్యా యుల వారి ద్వారా ఉప విద్యాశాఖాధికారి వారికీ అందచేయబడుతుంది. అచట నుండి సమగ్ర శిక్షా వారు జిల్లా స్థాయి రిపొర్ట్ ను తాయారు చేయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు/DIET STAFF /SS SECTORAL OFFICERS తనకు tag చేయబడిన పాఠశాల లను 15 రోజులకొకసారి విజిట్ చేసి, అభివృద్ధిని తెలియచేయాల్సి వుంటుంది. AWARDS & REWARDS :

ప్రతీ మండలం లో మంచి అభివృద్ధిని చూపిన పాఠశాల ల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు పురస్కారాలు అందచేయబడతాయి. అదేవిధంగా మానిటరింగ్ అధికారులు చే ప్రసంసింపబడిన ఉపాధ్యాయులకు గౌరవ అధికారుల చేతి మీదుగా MERIT CERTIFICATESఅందచేయబడతాయి . GRADING OF SCHOOLS :

పిల్లల సామర్ధ్యాల ఆధారంగా తరగతికి , పాఠశాల కు గ్రేడింగ్ ఇవ్వబడుతుంది. 1. 85 – 100% - 5 STARS 2. 60 – 84% - 4 STARS 3. 50 - 59% - 3 STARS 4. 35 – 49% - 2 STARS 5. UPTO ౩4 % - 1 STAR APRIL 30 నాటికీ అన్ని పాఠశాలల లోని అన్ని తరగతులు 5 STAR రేటింగ్ సాధించాలన్నది మన లక్ష్యం .






Recent Posts

See All

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లోప్రత్యేకకార్యక్రమాలు-మార్గదర్శకాలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ సూచనల మేరకు...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page