top of page
Writer's pictureAPTEACHERS

రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో భేటి(సమావేశం) నందు చేసిన ప్రాతినిధ్యాలు

నేడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రితో భేటి(సమావేశం) నందు చేసిన ప్రాతినిధ్యాలు ★ 1.ఉమ్మడి సర్వీస్ రూల్స్ - ప్రస్తుతం ఏ.పీ. అడ్మినిష్ట్రేషన్ ఉన్న కేసును త్వరగతిన పూర్తి చేయుటకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోని ఖాళీగా వున్న యంఇవో/డైట్ మరియు బి.ఈడీ. కళాశాలల లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలి. ★ 2.సాధారణ బదిలీలు - ప్రస్తుతం చేపడుతున్న డీ.ఎస్.సి. నియామకాల కంటే ముందే ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు పూర్తి చేయాలి. ★ 3. 40% JL ప్రమోషన్స్ - జీ.ఓ.నెం.223 ను సవరించి ఉపాధ్యాయులకు కల్పించాల్సిన 40% జె.ఎల్. కోటాను పునరుద్ధరించి అర్హూలైన స్కూల్ అసిస్టెంట్ లకు జె.ఎల్. పదోన్నతి కల్పించాలి. ★ 4.అప్ గ్రేడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం - నూతనంగా అప్ గ్రేడ్ అయిన పాఠశాలల్లో హెచ్.ఎం. మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయీలి. ★ 5. మండల విధ్యాధికారులకు స్వతంత్ర్య అధికారాలు- MPDO పరిధిలో నుంచి మండల విధ్యాధికారులను వేరు చేసి స్వతంత్ర డీడీవోలుగా పరగణిస్తూ, ప్రతి మండల వనరుల కేంద్రానికి ఒక జూనియర్ అసిస్టెంట్ ను కేటాయించాలి. సీనియర్ ఎంఈవోలు మరియు హెచ్.ఎం.లకు, DyEO(FAC) లుగా నియమించాలి. ★ 6. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు - 27% ఐఆర్ వర్తింపు - 010 పద్దు ద్వారా వేతనాలు - ప్రిన్సిపల్ లకు డీడీవోలుగా సంపూర్ణ అధికారాలు - డీఎస్సీ నియామకాల కంటే ముందుగా టీజీటీలు,పీజీటీలకు పదోన్నతులు - హెల్త్ కార్డులు, మెడికల్ రియంబర్స్మెంట్ సదుపాయం కల్పించాలి ★ 7. పండిట్/ పీఈటీ పదోన్నతులు - అప్ గ్రేడ్ అయిన పండిట్, పీఈటీ పోస్టులను అర్హూలయిన ఉపాధ్యాయులతో పదోన్నతులు చేపట్టాలి. ★ 8. రూ.398/- నోషనల్ ఇంక్రిమెంట్స్ - (1983-1994) మధ్య కాలంలో పనిచేసిన రూ.398/- స్పెషల్ పే టీచర్లకు పనిచేసిన కాలానికి అనుగుణంగా నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి (జీ.ఓ.నం.28 తేది:01-03-2019 ను సవరించాలి) ★ 9. ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ - 2001 నుండి జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో పెండింగ్ లో వున్న ఉపాధ్యాయుల సర్వీస్ ను క్రమబద్ధీకరించాలి. ★ 10. సమన్వయ సమావేశాలు - ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో (రాష్ట్ర స్థాయిలో,జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో) సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ★ 11. ఎయిడెడ్ పాఠశాలల - ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, - పదోన్నతులు, - యాక్ట్ 35/2005 నుంచి అమలు - హెల్త్ కార్డుల మంజూరు - ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు IIIT అడ్మిషన్లలో అవకాశం. ★ 12. 610 జీ.ఓ. - రాష్ట్ర విభజన నేపధ్యంలో 610 జీ.ఓ. క్రింద ఉన్న 761 మంది వారు కోరుకున్న జిల్లాలో కొనసాగిస్తూ పదోన్నతులు చేపట్టాలి. ★ 13. అంతర్ రాష్ట్ర బదిలీ - తెలంగాణా రాష్ట్రంలో మిగిలిపోయని, ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 352 మంది ఉపాధ్యాయులను వారీ కొరిక మేరకు సొంత ప్రాంతాలకు బదిలీలు చేయాలి. ★ 14. కెజీబీవీ టీచర్లు - కేజీబీవీ టీచర్లను రెగ్యులైజ్ చేసి, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని రకాల సెలవులను వర్తింపజేయాలి. ★ 15. స్కావెంజర్స్ జీతాలు - ప్రతి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ టీచర్, నైట్ వాచ్ మెన్ ను నియమించాలి. - స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలను చెల్లించాలి. ★ 16. స్పెషల్ డీ.ఎస్.సి. - ఉన్నత పాఠశాలల్లోని వ్ర్రత్తి ఉపాధ్యాయ పోస్టులు ( డ్రాయింగ్, క్రాఫ్ట్,వీవింగ్,టైలరింగ్ తదితర) భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి. ★ 17. శాశ్వత నియామకాలు - డైట్/ బీ.ఈడీ.(IASE)/ NCERT లలో అధ్యాపకులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలి. ★ 18. ప్రతి నియోజకవర్గానికి DyEO - ప్రతి నియోజక వర్గానికి ఒక డిప్యూటీ డీఈవో పోస్టును కేటాయించాలి. - ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారిగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులనే నియమించాలి. ★ 19. ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు - ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు/ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ ను నియమించాలి. ★ 20. శాఖపరమైన పరీక్షల మినహాయింపు- 50 సంవత్సరాల వయసు పైబడిన ఉపాధ్యాయులకు శాఖపరమైన పరీక్షల నుంచి మినహాయుంచాలి. - శాఖపరమైన పరీక్షలలో వ్యతిరేక (నెగిటీవ్)మార్కులను తొలగించాలి. ★ 21. ఉర్దూ పోస్టుల కేటాయింపు- రాష్ట్రంలో నూతనంగా అప్ గ్రేడ్ అయిన 220 ఉర్దూ మీడీయం పాఠశాలల్లో 660 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసి (70:30) దమాషాలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ★ 22. గుంటూరు జిల్లా లో 2002 సం" ఉపాధ్యాయ పదోన్నతుల సీనియారిటీ లిస్టులో జరిగిన అవకతవకలను సరిచేసి, నష్టపోయిన ఉపాధ్యాయులకు నోషనల్ సీనీయారిటి ఇవ్వాలి.

21 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page