top of page

సుకన్య సమృద్ధి యోజన 

💁సుకన్య సమృద్ధి యోజన.....నెలకు రూ.1,000తో రూ.75 లక్షలు 💠ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 💠ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. 💠 స్కీమ్‌పై లభిస్తున్న వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. 10 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు కూతుర్ల పేరుపై సుకన్య సమృద్ధి అంకౌంట్లను ప్రారంభించొచ్చు. 💠దత్తత తీసుకున్న ఆడ పిల్ల పేరుపై కూడా ఖాతా తెరవొచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి ఖాతా ప్రారంభించొచ్చు. 💠ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల (నెలకు రూ.12,500) వరకు అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చు. కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. 💠నెలకు రూ.1,000 నుంచి రూ.12,000 మధ్యలో కట్టుకుంటే మెచ్యూరిటీ తర్వాత రూ.6 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు పొందొచ్చు. 💠ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు వరకు అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఆడ పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత 50 శాతం డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. 💠 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉన్నత చదువు, పెళ్లి వంటి వాటికి డబ్బుల్ని ఉపయోగించుకోవచ్చు. 💠పాప బర్త్ సర్టిఫికెట్, ఫోటోలు, తల్లిదండ్రులు లేదా సంరక్షుల ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. 💠రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ సాయంతో ఆటోమేటిక్‌గానే డబ్బులను అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం ఉంది. 💠సుకన్య సమృద్ధి అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంకులు ఇలాంటి సేవలు అందించడం లేదు. 💠కేవలం కొన్ని బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. బ్యాంక్ నుంచి ఎస్ఎస్‌వై అకౌంట్ లాగిన్ వివరాలు తీసుకోవాలి. 💠 ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత హోమ్ పేజ్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

13 views

תגובות


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page