సరెండర్ లీవ్ వివరణ :
G.O. Ms. NO.238 ఆర్ధిక శాఖ, తేదీ.13.08.1969 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లోని గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉద్యోగులు, తమకు నిల్వ ఉన్న సంపాదిత సెలవు (Earned Leave) ని సరెందర్ చేసుకుని దానికి సమానమైన లీవ్ శాలరీ పొందే అవకాశం కల్పించ బడింది.తదుపరి నాల్గవ తరగతి ఉద్యోగులకు కూడా ఈ అవకాశం కల్పించ బడింది. (సర్క్యులర్ మెమో నెం.52729-A/681/69-1, 11.10-1969 ఆర్ధిక శాఖ)
రాష్ట్ర ప్రభుత్వం లో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇలా సరెండర్ చేయడం ద్వారా నగదు చెల్లించదు. (G.O.Ms. No. 211 ఆర్ధిక శాఖ, తేదీ.10.04.1972)
ఫారిన్ సర్వీసు డిప్యుటేషన్ లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరెందర్ లీవ్ మాతృ శాఖ చెల్లించాలి. (ఫారిన్ ఎంప్లాయర్ లీవ్ శాలరీ కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంటుంది)
ఎప్పుడు వినియోగించు కొనవచ్చును
12 నెలల విరామంతో 15 రోజులు, 24 నెలల విరామం తో 30 రోజులు సరెండర్ చేసుకొన వచ్చును.
తాత్కాలిక ఉద్యోగులు 24 నెలల విరామం తో 15 రోజులు సరెండర్ చేసుకొన వచ్చును. (G.O.Ms. No. 211 ఆర్ధిక శాఖ, తేదీ.10.04.1972 & G.O.Ms. No. 316 ఆర్ధిక శాఖ, తేదీ.25.11.1974)
సంపాదిత సెలవు (Earned Leave) ఖాతాలో 285 ఎక్కువ సెలవులు ఉన్నవారు 12 నెలలు విరామం లేకుండానే ప్రతీ సంవత్సరం జూన్ 30 వ తేదీన సరెందర్ చేసుకొన వచ్చును.
ఎటువంటి విరామం లేకుండా పదవీ విరమణ చేసి పునర్నియామకం పొందిన వారు కూడా సరెండర్ చేసుకొన వచ్చును. (G.O. Ms .No. 324 ఆర్ధిక శాఖ, తేదీ.30.07.1976).
ఏ తేదీన సరెండర్ చేయాలి
ఉద్యోగి దరఖాస్తు చేసిన తేదీ న సరెండర్ కు అనుమతించవచ్చు. పాత తేదీ తో సరెండర్ కు అనుమతించ రాదు (సర్క్యులర్ మెమో నెం.49395/19/FR-II/75-1, 06-01-1976 ఆర్ధిక శాఖ)
బేసిక్ పే తో పాటు అనుమతించబడిన అలవెన్సులు
(సర్క్యులర్ మెమో నెం.52729-A/681/69-1, 11.10-1969 ఆర్ధిక శాఖ)
కరువు భత్యం (Dearness Allowance - D.A.)
ఇంటి అద్దె భత్యం (House Rent Allowance - H.R.A.)
అదనపు ఇంటి అద్దె భత్యం (Addional H.R.A) - (G.O. Ms. No.25 ఆర్ధిక శాఖ Dt.05.02.1996)
Compensatory Allowances (CCA/SCA etc)
వ్యక్తిగత వేతనం (Personal Pays - P.P)
విధి నిర్వహణ కొరకు ఇచ్చే ఇతర అలవెన్సులు, మరియు స్పెషల్ పే లు, మధ్యంతర భ్రుతి చెల్లించ బడవు.
ఏ నెలలో సరెండర్ చేసినప్పటికీ సరెండర్ చేసిన సెలవు కు నగదు చెల్లించడానికి నెలకు 30 రోజులుగా పరిగణించి లెక్కించ వలెను. (G.O. Ms. No. 306 ఆర్ధిక శాఖ, తేదీ.08.11.1974)
ప్రభుత్వ క్వార్టర్స్ లో నివసిస్తూ ప్రతీ నెల జీతం తో ఇంటి అద్దె భత్యం (House Rent Allowance - H.R.A.) పొందని వారు కూడా సరెండర్ చేసిన లీవ్ శాలరీ తో ఇంటి అద్దె భత్యం (House Rent Allowance - H.R.A.) చెల్లించాలి.
సరెండర్ లీవ్ ఉత్తర్వుల కాల పరిమితి 90 రోజులు. ( 27/423/A2/FR-II/97-1, 18.08-1997 ఆర్ధిక శాఖ