top of page

జగనన్న విద్యా కానుక వారోత్సవాలు Rc.No. Spl/JVK/2020 , Dt: 20-11-2020

Updated: Aug 23, 2021


జగనన్న విద్యా కానుక వారోత్సవాలు - జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహణ కొరకు జిల్లా విద్యాశాఖాధికారులకు , సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినటర్లకు మార్గదర్శకాలు జారీ. Rc.No. Spl/JVK/2020 , Dated: 20-11-2020


జగనన్న విద్యాకానుక వారోత్సవాలు


★ 23వ తేది: విద్యార్థులకు, తల్లిదండ్రులకు 'జగనన్న విద్యాకానుక' గురించి అవగాహన కల్పించడం. ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అందిందా లేదా పరిశీ లించడం. బయోమెట్రిక్ అథంటికేషన్ తనిఖీ


★ 24వ తేది: విద్యార్థులు యూనిఫాం కుట్టించుకున్నారో లేదో పరిశీలించడం. కుట్టు కూలి ఖర్చులు తల్లుల ఖాతాలకు జమచేస్తున్న విషయాన్ని తెలపడం. దుస్తులు కుట్టించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం


★ 25వ తేదీ: విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం, సా క్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పిం చడం. బూట్ల కొలతల్లో ఇబ్బందులుంటే సరిదిద్దడం


★ 26వ తేది: పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలకు అట్టలు వేసుకోవడం, పుస్తకాలను ఉపయో గించుకోవడంపై అవగాహన కల్పించడం


★ 27వ తేది: బ్యాగులు వాడే విధానం, పాఠశాల బ్యాగు బరువు తగ్గించే విధానం గురించి అవగాహన కల్పించడం. బ్యాగుల విషయంలో ఏవైనా సూచనలుంటే అధికారుల దృష్టికి తీసుకురావడం


★ 28వ తేది: జగనన్న విద్యాకానుక కిట్లో అన్ని వస్తు వులు అందాయా లేదా తెలుసుకోవడం, బయోమెట్రిక్ సరిగా ఉందో లేదో పరిశీలించడం.



Comentários


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page